Devarakonda with Gowtam: మరో రిస్క్ కు రెడీ అయిన దేవరకొండ.. చరణ్ వద్దన్న కథకు గ్రీన్ సిగ్నల్!

Vijay Devarakonda Green singal to gowtam tinnanuri Subject rejected by Ram Charan: వినయ విధేయ రామ లాంటి భారీ డిజాస్టర్ తో రామ్ చరణ్ కథలు ఎంచుకునే విషయం మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. ఆ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ తో సూపర్ హిట్ అందుకున్న రాంచరణ్ ఆ తర్వాత మళ్లీ ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కథలు ఎంచుకునే విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేని ఆయన గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేసిన ప్రాజెక్టును సైతం పక్కన పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

నిజానికి రామ్ చరణ్ తేజ శంకర్ తో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు శంకర్ భారీగా ఖర్చు పెట్టిస్తున్నారు. రామ్ చరణ్ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, జయరాం వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ 16వ సినిమా ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా రూపొందాల్సి ఉంది.

కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని రాంచరణ్ గౌతం తిన్ననూరి ప్రాజెక్టు పక్కన పెట్టేశాడని తాను సినిమా చేయలేనని ఎన్వీ ప్రసాద్ కి చెప్పేశారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇదే కథను గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ దృష్టికి తీసుకువెళ్లారని విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చివరిగా లైగర్ అనే ఒక స్పోర్ట్స్ డ్రామాలో హీరోగా నటించారు. ఆ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేయగా ప్రేక్షకులు ఈ సినిమాని ఏమాత్రం ఆదరించలేదు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా చేస్తున్నాడు, శివ నిర్వాణ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ సుకుమార్ పుష్ప 2 సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు కాబట్టి విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేసే అవకాశం మెండుగా కనిపిస్తుంది.

నాని హీరోగా జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గౌతం తిన్ననూరి అదే సినిమాని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి రిలీజ్ చేశారు. అయితే పలు కారణాలతో బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం జెర్సీ సినిమాని ఏమాత్రం ఆదరించలేదు. మరి విజయ్ దేవరకొండతో గౌతం తిన్ననూరి సినిమా నిజంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందా? లేక అది కాస్త కొత్త సబ్జెక్టా అనే విషయం మీద మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వస్తే తప్ప అది ఏ సబ్జెక్టు అనే విషయం పూర్తిగా క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.

Also Read: Bimbisara Director to Rajanikanth: నక్క తోక తొక్కిన బింబిసార డైరెక్టర్.. ఏకంగా రజనీకాంత్ కే నెరేషన్?

Also Read: NBK 107 Title: అన్నగారు ? రెడ్డి గారు? ఆ టైటిల్ కే మొగ్గు చూపుతున్న 107 మేకర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

English Title: 
Vijay Devarakonda Green singal to Gowtam Tinnanuri Subject Rejected by Ram Charan
News Source: 
Home Title: 

మరో రిస్క్ కు రెడీ అయిన దేవరకొండ.. చరణ్ వద్దన్న కథకు గ్రీన్ సిగ్నల్!

Devarakonda with Gowtam: మరో రిస్క్ కు రెడీ అయిన దేవరకొండ.. చరణ్ వద్దన్న కథకు గ్రీన్ సిగ్నల్!
Caption: 
Vijay Devarakonda Green singal to gowtam tinnanuri Subject rejected by Ram Charan Source: twitter
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మరో రిస్క్ కు రెడీ అయిన దేవరకొండ.. చరణ్ వద్దన్న కథకు గ్రీన్ సిగ్నల్!
Chaganti Bhargav
Publish Later: 
No
Publish At: 
Thursday, October 20, 2022 - 13:30
Request Count: 
88
Is Breaking News: 
No