మొదటి రోజు జరుకుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. ఈ రోజు బియ్మం, నువ్వులు, చక్కెరను ప్రసాదంగా పెడతారు.
అందరూ 2వ రోజు జరుపుకునే బతుకమ్మనే అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజు బెల్లంతో పాటు పప్పును ప్రసాదంగా సమర్పిస్తారు.
ఎంతో భక్తితో 3వ రోజు జరుపుకునే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు పాలతో తయారు చేసిన ఆహారాలు సమర్పిస్తారు.
4వ రోజు జరుపుకునే బతుకమ్మను నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు బియ్యంతో పాటు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.
5వ రోజు ఎంతో ఆనందంగా అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజు అట్లను ప్రసాదంగా సమర్పిస్తారు.
ఆనందంగా 6వ రోజున జరుపుకునే బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు అమ్మవారికి ప్రసాదం సమర్పించరు.
ఘనంగా 7వ రోజు జరుపుకునే బతుకమ్మను వేపకాయల బతుకమ్మగా చెప్పుకుంటారు. ఈ రోజు వేయించిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.
8వ రోజు జరుపుకునే బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు బెల్లంతో తయారు చేసిన ప్రసాదం పెడతారు.
చివరి 9వ రోజున అశ్వయుజ అష్టమిన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజు సత్తిపిండిని నైవేద్యాన్ని సమర్పిస్తారు.