హిందూ సంప్రదాయంలో పూజలు ఒక ముఖ్యమైన అంశం. భక్తితో దేవుళ్లను ఆరాధించేటప్పుడు, దీపారాధన ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
అయితే దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది. దీపం వెలిగించడానికి నూనె, నెయ్యి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
పూర్వ కాలం నుంచి నూనెను దీపారాధనకు వినియోగిస్తున్నారు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం వంటి సహజ నూనెలు సాధారణంగా ఉపయోగించేవి
కొన్ని నూనెలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కొబ్బరి నూనె పరిసరాలను శుభ్రపరుస్తుందని నమ్ముతారు.
నెయ్యిని సాధారణంగా పవిత్రమైనదిగా భావిస్తారు. పూజలలో నెయ్యి దీపం వెలిగించడం శుభకరమని, దైవకృపను కలుగజేస్తుందని నమ్ముతారు.
నెయ్యి అగ్నిహోత్రం వంటి వేదక ఆచారాలలో కూడా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. దాని అధిక దహన శక్తి కారణంగా, నెయ్యితో వెలిగించిన దీపం ఎక్కువ సమయం మండుతుందని నమ్ముతారు.