Black Hair Remedy: తెల్ల వెంట్రుకల్ని వేళ్లతో సహా నల్లబడాలంటే ఈ పదార్ధం కలిపితే చాలు
ఇటీవలి కాలంలో వయస్సు కంటే ముందే జుట్టు తెల్లబడిపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. జుట్టు నల్లబడేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు
మార్కెట్‌లో దీనికోసం చాలా ఖరీదైన ఉత్పత్తులున్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలికమే. శాశ్వత ప్రయోజనాలు కల్పించవు
ఈ ఉత్పత్తుల కంటే కొన్ని హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి.
ఆవనూనె కేశాలకు చాలా మంచిది. కేశాల్ని సహజసిద్దంగా నల్లబడేలా చేస్తుంది. ఆవ నూనె రాయడం వల్ల కేశాలు కుదుళ్లతో సహా పటిష్టంగా మారుతాయి. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.
కరివేపాకులు కూడా కేశాలు నల్లబడేందుకు అద్భఉతంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్, ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. దీనివల్ల కేశాలు ఎదిగేందుకు, రంగు నల్లబడేందుకు ఉప.యోగపడతాయి
ఆవనూనెను కొద్దిగా వేడి చేసి అందులో 10-15 కరివేపాకులు వేయాలి.
స్లో ఫ్లేమ్‌లో ఈ రెండింటినీ బాగా ఉడికింంచాలి. కరివేపాకు రంగు నల్లబడేవరకూ వండాలి. ఆ తరువాత వడపోసి బాటిల్‌లో భద్రపర్చుకోవాలి
ఈ నూనెను చేతులతో మీ కేశాలకు కుదుళ్లతో సహా రాసి మాలిష్ చేసుకోవాలి. 1-2 గంటలు ఉంచి అప్పుడు కేశాలు శుభ్రం చేసుకోవాలి
ఇలా వారానికి 2-3 సార్లు రాసుకుంటే చాలా త్వరగా మీ కేశాలు నల్లబడతాయి. ఒకసారి నల్లబడ్డాక ఆ రంగు శాశ్వతంగా ఉండవచ్చు