Sankranthi Special Sakinalu: తెలంగాణ స్పెషల్ సకినాలు ఇలా చేస్తే కరకరలాడుతుంటాయి

Bhoomi
Jan 09,2025
';

సకినాలు

సంక్రాంతి వస్తుందంటే తెలంగాణ పల్లెలు పిండి వంటలతో ఘుమఘమలాడుతుంటాయి. ఏ గల్లికి పోయినా పిండివంటలే పలకరిస్తుంటాయి.

';

తెలంగాణ స్పెషల్ సకినాలు

మరి ఈ సంక్రాంతి పండక్కి తెలంగాణ స్టైల్ సకినాలు చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఈ టిప్స్ ఫాలో అయితే సకినాలు కరకరలాడుతుంటాయి.

';

కావాల్సిన పదార్థాలు

బియ్యం, నువ్వులు, ఉప్పు, వాము, నీళ్లు, నూనె

';

తయారీ విధానం

ఒక బౌల్ తీసుకుని అందులో 6 కప్పుల బియ్యం పోసి కడిగి 15 నుంచి 16 గంటల వరకు రాత్రంతా నానబెట్టాలి.

';

నీరు పోయే వరకు

ఈ బియ్యాన్ని తీసి ఒక కాటన్ వస్త్రంపై 10 నుంచి 15 నిమిషాల వరకు ఆరబెట్టాలి. బియ్యం పూర్తి ఆరకముందే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.

';

నువ్వులు,వాము

ఇప్పుడు ఆ పిండిలో నువ్వులు, వాము వేసి రుచికి తగినంతగా ఉప్పు వేసుకుని కలపాలి.

';

వదులుగా కాకుండా

పిండి మరీ వదులుగా కాకుండా గట్టిగానే అంటే చేతిలో వేసుకుంటే జారీపోయే విధంగా నీళ్లు పోసి కలుపుకోవాలి.

';

కాసేప పక్కన

ఆ పిండిని కాసేపు పక్కన పెట్టి మరో శుభ్రమైన కాటన్ వస్త్రం తీసుకుని నేలమీద పరుచుకోవాలి.

';

కాటన్ క్లాత్

పిండి తీసుకుని కాటన్ క్లాత్ పై వేళ్ల సహాయంతో సన్నగా పిండిని వదులుతూ గుండ్రంగా తిప్పుకోవాలి. ఇలా వేసినవాటిని నూనెలో వేయించుకోవాలి. అంతే సకినాలు రెడీ

';

VIEW ALL

Read Next Story