డెడ్‌స్కిన్‌కు చెక్ పెట్టే 6 హోం రెమిడీస్

Renuka Godugu
Mar 16,2024
';

కాఫీ స్క్రబ్..

ఒక స్పూన్ కాఫీ పొడితో మరో స్పూన్ తేనెవేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసుకోవాలి. సర్క్యూలర్ మోషన్లో డెడ్ స్కిన్‌పై ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది.

';

కలబంద స్క్రబ్..

బియ్యం పిండి ఒక చెంచా తీసుకోండి. అందులో రెండు చెంచాల కలబందా జెల్ ను వేసి కలపండి. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

';

శనగపిండి..

ఒక చెంచా శనగపిండిలో ఒక చెంచా పసుపు వేసి కలపండి. దీంట్లో రెండు చెంచాల పాలు కలిపి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. ఈ స్క్రబ్ కూడా మృతకణాలను తొలగిస్తుంది.

';

ఓట్స్ స్క్రబ్..

రెండు గంటలపాటు రెండు చెంచాల ఓట్స్‌ను పాలలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ ను ముఖంపై రుద్దుకోవాలి.

';

కమలపండు తొక్క..

ఒక చెంచా కమలపండు తొక్క పొడిలో రెండు చెంచాల పాలను బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖం పై రుద్దుకుంటే సరి

';

షుగర్ స్క్రబ్..

తేనెలో ఒక చెంచా బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి. ఇది కూడా డెడ్ స్కిన్ తొలగించుకోవడానికి మంచి హోం మేడ్ స్క్రబ్..

';

జాగ్రత్తలు..

డెడ్ స్కిన్ తొలగించుకోవడానికి వేసుకునే ఈ స్ర్కబ్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతే ముఖంపై వేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story