యుక్తవయస్సు, గర్భం, ఋతువిరతి, ఒత్తిడి వంటి హార్మోన్ల మార్పులు చర్మంపై అధిక జిడ్డు ఉత్పత్తికి దారితీస్తుంది. ఇది మొటిమలకు కారణమవుతుంది.
మీ కుటుంబంలో మొటిమల చరిత్ర ఉంటే, మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చర్మంపై ఉండే బ్యాక్టీరియా జిడ్డు గ్రంథులను పూడిక చేసి, మొటిమలకు దారితీస్తుంది.
కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులు రంధ్రాలను మూసుకుపోయి మొటిమలకు దారితీస్తాయి.
కొన్ని ఆహారాలు, పాల ఉత్పత్తులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు మొటిమలను తీవ్రతరం చేస్తాయి.
ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. దీని కారణంగా కూడా మొటిమలు వస్తాయి.
కొన్ని మందులు, స్టెరాయిడ్స్ వంటివి మొటిమలకు దారితీస్తాయి.
నిద్రలేమి, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారం మొటిమలను తీవ్రతరం చేస్తాయి.