కొన్నిరోజులుగా ఎండలు ప్రజలకుద చుక్కలు చూపిస్తున్నాయి.
ఉద్యోగాలకు, బిజినెస్ ల కోసం వెళ్తున్న వారికి చుక్కలు కన్పిస్తున్నాయి.
ఈ క్రమంలో కొందరు వడదెబ్బ ప్రభావానికి గురౌతున్నట్లు సమాచారం.
కొందరికి నీళ్లు తాగే అలవాటు చాలా తక్కువగా ఉంటుంది.
వడదెబ్బ తగలగానే ఒక్కసారిగా బాడీ అంతా వేడెక్కిపోతుంది.
కొందరికి శ్వాస తీసుకొవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
నాలుక తడారిపోయి, కళ్లుబైర్లు కమ్మి, తలనొప్పిగా ఉంటుంది.
వెంటనే వీరిని నీడలోకి తీసుకెళ్లి శరీరంపైన ఉన్న బట్టలను తీసేయాలి
చల్లని నీళ్లలో బట్టను ముంచి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరంమంతా తుడవాలి.
ప్రాథమిక చికిత్స అందించి దగ్గరలోని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.