మనలో చాలా మంది ముఖం అందంగా, కాంతి వంతంగా కన్పిచడం కోసం నానాతంటాలు పడుతుంటారు.
కిచెన్ లోని కొన్ని సింపుల్ పాటిస్తే, బ్యూటిపార్లర్ లకు వెళ్లకుండానే ముఖంలో మెరుపు తెప్పించుకోవచ్చు.
ప్రతిరోజు యోగా, మెడిటేషన్ చేస్తే ముఖంలోని ముడతలు క్రమంగా మాయమైపోతాయి.
రాత్రి పడుకునే ముందు ముఖం చక్కగా కడుక్కొని ముఖానికి తేనెను రాసి గంట తర్వాత ముఖం కడ్డుక్కుంటే గ్లో వస్తుంది.
ఇంట్లో ఉండే కాఫీపొడి,ముల్తానీ మిట్టి, తేనె, పాల మీగడలతో ముఖంకు రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
కలబందను నుంచి జెల్ ను తీసి ముఖానికి రాయాలి. గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకొవాలి.
తులసీ ఆకులు, తులసీ నీళ్లతో తరచుగా ముఖం కడుక్కుంటు ఉన్న కూడా ముఖం మెరుస్తుంది.
చల్లని నీళ్లతో కాకుండా... వేడి నీళ్లను చేసి ముఖంకు కాపడం పెట్టుకొవాలి. బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు.
పనిమీద, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి స్కార్ఫ్ లేదా ముఖం కవరయ్యేలా చూసుకొవాలి.