గ్యాస్ సమస్యతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు.. అయితే జీరా వాటర్ గ్యాస్ సమస్యను త్వరగా దూరం చేస్తుంది అని మీకు తెలుసా..?
ప్రతిరోజు రాత్రి నీతిలో కొద్దిగా జీరా వేసుకొని.. గోరువెచ్చగా కాంచి.. వడకట్టుకొని ఆ నీళ్లు తాగితే.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
అంతేకాదు జీరా వాటర్.. ఇది పేగు సమస్యలను తగ్గించి.. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
1 టీస్పూన్ జీలకర్రను.. 1 గ్లాసు నీటిలో 10 నిమిషాల పాటు మరిగించి, గోరువెచ్చగా తాగండి.
ఈ నీళ్లు రోజు.. రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల శరీరంలోని గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
జీరా వాటర్‌లో ఉన్న యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. శరీరాన్ని శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈ చిట్కాను పాటిస్తే గ్యాస్ సమస్యలతో పాటు.. మరిన్ని జీర్ణ సమస్యల దూరం కావడం ఖాయం.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.