మనోజ్ కుమార్ శర్మ:

గతేడాది అత్యంత చర్చనీయాంశమైన చిత్రం ఐపీఎస్ మనోజ్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్. విక్రాంత్ మాస్సే టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం టైటిల్‌ను గెలుచుకుంది.

Samala Srinivas
Apr 05,2024
';

స్పూర్తిదాయకమైన కథ:

యువతకు ప్రేరణ కలిగించాలనే ఉద్దేశ్యంతో.. ఐపీఎస్ అధికారి అయిన మనోజ్ కుమార్ శర్మ జీవితాన్ని సినిమాగా తీశారు.

';

మనోజ్ స్వస్థలం.

2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా నివాసి. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్ఖాయికి చేరుకున్నాడు.

';

12th ఫెయిల్ అయ్యాడు..

9, 10వ థర్డ్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించిన మనోజ్ కుమార్ 12వ తరగతిలో హిందీ మినహా అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. రెండోసారి ఆయన ఉత్తర్ణీత సాధించారు. అతడి మార్కులు ఆయన విజయానికి అడ్డంకిగా మారలేదు.

';

కటిక పేదరికం నుంచి..

మనోజ్ కుమార్ చాలా పేదరికాన్ని అనుభవించాడు. కూలి పనులు చేసుకుంటూ చదువు కొనసాగించాడు. టెంపో డ్రైవర్‌గా కూడా పనిచేశాడు.

';

లైబ్రరీలో పని చేసేవాడు.

ఢిల్లీలోని ఒక లైబ్రరీలో ప్యూన్‌గా పనిచేస్తూ చాలా మంది ప్రముఖ రచయితల పుస్తకాలు చదివాడు. లింకన్, ముక్తిబోధ్ మరియు గోర్కీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలలో మునిగిపోయాడు.

';

మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు..

మనోజ్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన UPSC ప్రిపరేషన్‌ను కొనసాగించాడు. ఆయన మూడు ఎటెంప్ట్ లో ఫెయిల్ అయ్యాడు. చివరకు నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాడు.

';

నాలుగో ప్రయత్నంలో సక్సెస్..

నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అందుకున్న మనోజ్ కుమార్ యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా 121వ ర్యాంక్ సాధించాడు.

';

ఆయన భార్య కూడా ఐఆర్‌ఎస్‌ అధికారి

ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ భార్య శ్రద్ధ ఐఆర్‌ఎస్‌ అధికారి. మనోజ్ యూపీఎస్సీకి ప్రిపేరేషన్ సమయంలో నిరుత్సాహానికి గురైన ప్రతిసారి ఆమెను పోత్సాహించేది శ్రద్ధా.

';

ప్రస్తుత పోస్టింగ్:

ఇటీవల అతను మహారాష్ట్ర పోలీస్‌లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) నుండి ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజి) గా పదోన్నతి పొందాడు.

';

VIEW ALL

Read Next Story