వీఆర్వోల అరాచకాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

గ్రామ స్థాయిలో వీఆర్వోల అరాచకాలు అన్నీ ఇన్నీ కావని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు.

Last Updated : Jul 19, 2019, 07:27 PM IST
వీఆర్వోల అరాచకాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

హైదరాబాద్: గ్రామ స్థాయిలో వీఆర్వోల అరాచకాలు అన్నీ ఇన్నీ కావని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. వీఆర్వో తల్చుకుంటే ఒక రైతు భూమిని ఇంకో రైతుకు రాసిచ్చేస్తాడని చెబుతూ.. ఏ ముఖ్యమంత్రికి, సీసీఎల్ఏ(చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్)కి లేని అధికారాలు వీఆర్వోలకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ అండదండ లేని అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులకు బుద్దిచెప్పేలా కఠినతరమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ అన్నారు. తమను ఎన్నుకున్న ప్రజల సంక్షేమం కోసం ఎక్కడివరకైనా వెళ్లడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాల్లో మునిసిపాలిటీ బిల్లు 2019పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Trending News