Former Minister Vijaya Rama Rao Passed Away: మాజీ మంత్రి, మాజీ సీబీఐ డైరెక్టర్ కె.విజయ రామారావు (85) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జన్మించిన ఆయన.. 1959లో ట్రైనీ ఐపీఎస్‌గా విధుల్లో చేరారు. ఆ తరువాత హైదరాబాద్ కమిషనర్‌గా.. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ముంబై బాంబు పేలుళ్లు, ఇస్రో గూఢచర్యం వంటి కేసులు దర్యాప్తు చేశారు. 1991 నుంచి 96 మధ్య దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఉన్న సమయంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా పని చేశారు.
సీబీఐ డైరెక్టర్‌గా రిటైర్ అయిన తరువాత 1999 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి.. అప్పటి సీఎల్పీ నేత, కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్ధన్ రెడ్డిపై గెలుపొందారు. ఆ తరువాత మంత్రిగానూ ఎంపికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పీజేఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. 2014లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
కేసీఆర్ స్థానంలో మంత్రి పదవి..
1999లో ఎమ్మెల్యే ఎన్నికైన తరువాత విజయ రామారావు వల్లే కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కలేదనే ప్రచారం ఉంది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయనను చంద్రబాబు స్వయంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఖైరతాబాద్ టికెట్ ఇచ్చి దగ్గర పోటీ చేయించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తన కేబినెట్‌లో మంత్రి పదవి కూడా ఇచ్చారు. రోడ్లు భవనాల శాఖ బాధ్యతలు అప్పగించారు. విజయ రామారావుకు మంత్రి పదవి ఇవ్వడంతో కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు చంద్రబాబు.
అంతకుముందు రవాణ శాఖ మంత్రిగా పని చేసిన కేసీఆర్‌ను కాదని సామాజిక లెక్కల్లో విజయ రామారావుకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన కేసీఆర్.. డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత విజయ రామారావును కేసీఆర్ స్వయంగా తమ పార్టీలో ఆహ్వానించారు. 2014లో ఆయన గులాబీ గూటికి చేరారు.
విజయ రామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్నఅనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగతులైన మాజీ మంత్రి విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.
Also Read: 7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఆ రోజే లాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook