Sri Chaitanya College students: శ్రీ చైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 30 మంది విద్యార్థులకు పాజిటివ్!!

Sri Chaitanya College students tested postive for Coronavirus: హైదరాబాద్ నగరం నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 30 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 05:17 PM IST
  • శ్రీచైతన్య కాలేజీలో కరోనా కలకలం
  • 30 మంది విద్యార్థులకు పాజిటివ్
  • కాలేజీ క్యాంపస్‌లోనే ఐసోలేషన్‌
Sri Chaitanya College students: శ్రీ చైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 30 మంది విద్యార్థులకు పాజిటివ్!!

30 Students tested positive for Covid 19 in Sri Chaitanya College: హైదరాబాద్ నగరం నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ (Sri Chaitanya College)లో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 30 మంది విద్యార్థుల‌కు (Sri Chaitanya college Students) క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఇంకా 262 మంది విద్యార్థుల‌ ఫలితాలు రావాల్సి ఉందట. క్రిస్మస్ సెలవుల నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులలో ఒకరికి లక్షణాలు కనిపించాయి. దాంతో టెస్టులు చేయగా.. పాజిటివ్‌గా తేలిందని సమాచారం. పాజిటివ్‌గా తేలిన అందరినీ కళాశాల యాజమాన్యం ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ఘటనతో నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. 

నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో (Sri Chaitanya College in Narsingi) గత రెండు రోజులుగా కరోనా కేసులు భయటపడుతున్నాయి. మంగళవారం 16 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ కాగా.. ఈరోజు మరో 14 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిందని రంగారెడ్డి జిల్లా హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సృజన ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా సోకిన కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సొంత వాహనాల్లో ఇంటికి వెళ్లిపోయారని, మిగిలిన వారు క్యాంపస్‌లోనే ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. పాజిటివ్‌గా తేలిన కొంత మంది విద్యార్థులు క‌రోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read: Sudheer Babu- Krithi Shetty: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!!

నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో (Narsingi Sri Chaitanya College) నాన్ లోకల్ విద్యార్థులే ఎక్కువగా చదువుతున్నారు. హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులతో పాటు వరంగల్, నల్గొండ వంటి ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు సంఖ్యే ఎక్కువ ఉందని తెలుస్తోంది. క్రిస్మస్ సెలవులకు చాలా మంది స్టూడెంట్స్ ఇంటికి వెళ్లారని... తిరిగి వచ్చిన వారిలో ఒకరికి కరోనా సోకగా.. అది చాలా మందికి వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. అయితే అదృష్టం కొద్దీ కరోనావైరస్ సోకిన విద్యార్థులు అందరూ ఆరోగ్యంగానే ఉండడం సంతోషించాల్సిన విషయం. ఇక తెలంగాణ (COVID-19 cases in Tealangana) రాష్ట్రంలో మంగళవారం 228 కొత్త కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. 

Also Read: Jahnavi Dangeti : ఆంధ్ర అమ్మాయి జాహ్నవి రికార్డ్.. నాసా ట్రైనింగ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News