New Honda Amaze Facelift 2024: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా తమ కస్టమర్స్‌కి త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కొత్త మోడల్‌ను విడుదల చేయబోతోంది. అయితే ఈ కారు గతంలో విడుదల చేసిన అమేజ్ కంటే అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన వివరాలను హోండా అధికారికంగా వెల్లడించింది. దీనిని కంపెనీ డిసెంబర్ 4వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే విడుదలకు ముందే డీలర్‌షిప్‌లకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ కారు ఎలా ఉండబోతుందో, హోండా ఏయే ఫీచర్స్‌తో విడుదల చేయబోతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ కొత్త అమేజ్ సంబంధించిన వీడియోను హోండా కంపెనీ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియోలో భాగంగా కారును చూస్తే అద్భుతమైన లుక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది మార్కెట్లోకి విడుదలై ఇటీవలే విడుదలైనా టాటా కార్లతో పోటీ పడనుంది. ఇక ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. కొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని స్పై షాట్లలో కొత్త రంగులు చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
కొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఈ కారులో అప్పీల్ కోసం గ్రిల్ పైన క్రోమ్ బార్లను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ ఈ కారులో ప్రీమియం గ్రిల్‌తో కొత్త ఫాసియాని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇక లాంప్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఇంటిగ్రేటెడ్ LED DRLలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రొజెక్టర్ల లోపల కూడా అద్భుతమైన LEDలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు LED ప్రొజెక్టర్ ఫాగ్ లైట్లుతో విడుదల కానుంది. అలాగే వీటికి తోడుగా ఫాగ్ లైట్ హౌసింగ్‌ను కూడా అందిస్తోంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
ఈ హోండా అమేజ్ 2024 కారు రెయిన్ సెన్సింగ్ వైపర్‌ను కలిగి ఉంటుంది. అలాగే వీటికి ప్రత్యేకమైన సెన్సార్స్ కూడా లభిస్తున్నాయి. ఈ కారు ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్ సెటప్‌తో విడుదల కానుంది. ఇందులోని కంపెనీ 360-డిగ్రీ కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే కొత్త బంపర్స్‌తో పాటు షార్క్ ఫిన్ యాంటెన్నాను కలిగి ఉంటుంది. ఈ కారులో కంపెనీ కొత్త స్టీరింగ్ వీల్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో వస్తోంది. ఇక ఈ కారు 1.2-లీటర్, 4-సిలిండర్ NA పెట్రోల్ ఇంజనతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.