Electric Microcar 2024: వారేవా.. అద్భుతం.. 160 కిమీల డ్రైవింగ్ రేంజ్‌తో చీప్‌ ధరకే మైక్రో కారు.. ఫీచర్స్‌లో తగ్గేదే లే..

Electric Smart Microcar 2024: మార్కెట్‌లోకి తొలిసారిగా మైక్రో ఎలక్ట్రిక్‌ కారు అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో 160 కిమీల డ్రైవింగ్ రేంజ్‌తో విడుదల కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 30, 2024, 12:43 PM IST
Electric Microcar 2024: వారేవా.. అద్భుతం.. 160 కిమీల డ్రైవింగ్ రేంజ్‌తో చీప్‌ ధరకే మైక్రో కారు.. ఫీచర్స్‌లో తగ్గేదే లే..

Electric Smart Microcar 2024: తొలి సారిగా దేశంలో మొట్టమొదటి చౌకైన కారు విడుదల కాబోతోంది. మధ్యతరగతి కార్‌ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి విడుదలై MG కామెట్ EV, Tata Tiago EV కార్లకు పోటీగా మరో కారు లాంచ్ కాబోతోంది. ఈ కారు డెడ్‌ చీఫ్‌ ధరకే లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మంది ఇది తక్కువ ధరకే లభిస్తుంది.. కాబట్టి ఫీచర్స్‌ కూడా అదే మోతాదులో ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ త్వరలో లాంచ్‌ కాబోయే ఈ కొత్త కారు అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కానుంది. అలాగే ఇది శక్తివంతమైన ఇంజన్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

స్టార్టప్ పర్సనల్ మొబిలిటీ వెహికల్ త్వరలోనే లాంచ్‌ కాబోయే ఎలక్ట్రిక్‌ కారు మార్కెట్‌లో ప్రభంజనం సృష్టించబోతోంది. ఇది మైక్రో కారుతో పరిచయం కానుంది. అలాగే దీని ధర రూ.3 లక్షల నుంచి రూ.4 లోపే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది టూ సీటర్‌తో మాత్రమే అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా కంపెనీ ఈ కార్లకు సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిని కొనుగోలు చేయాలనుకునేవారు కేవలం రూ.2000 టోకెన్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అలాగే దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 160 కిమీల డ్రైవింగ్ సామర్థ్యాన్ని కూడా అందిస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన విడుదల తేదిని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 

అధికారిక సమాచారం ప్రకారం ఈ స్టార్టప్ పర్సనల్ మొబిలిటీ వెహికల్ ఎలక్ట్రిక్‌ కారు 2025 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక కారుకు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది కాంపాక్ట్ సైజ్‌తో పాటు మైక్రో సెగ్మెంట్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని ఇరుకు ప్రదేశాల్లో కూడా ఎంతో సులభంగా పార్కింగ్‌ చేయోచ్చు. ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ను సులభతరం చేసేందుకు ప్రత్యేకమైన EaS-E మోడ్‌ను కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు డ్రైవింగ్ సెన్స్ ఆటోమేటిక్ లాక్‌లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.  

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

ఈ కారులో అన్ని ఎలక్ట్రిక్‌ కార్లలాగే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు టూ ప్యాసింజర్‌ కెపాసిటీ కోసం రెండు సీట్లనే అందిస్తోంది. అలాగే ఈ కారుకు కేవలం రెండు డోర్లు మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా గ్రిప్ కోసం ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో రిమోట్ కంట్రోల్‌  AC, లైట్, విండోలు కూడా ఉంటాయి. దీంతో పాటు ఈ కారు బ్యాక్ సైడ్‌లో LED లైట్ సెటప్‌ కూడా లభిస్తోంది. ఇక ఈ కారును ఛార్జ్‌ చేయడానికి దాదాపు 4 గంటల పాటు టైమ్‌ పడుతుంది. దీంతో పాటు 15-ఆంపియర్ సాకెట్‌ను కూడా అందిస్తోంది.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News