Muralidhar Rao: తెలంగాణలో పొలిటికల్ హీట్ తీవ్రతరమవుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు హాట్ కామెంట్స్ చేశారు.
Minister Harish Rao: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. నీతి ఆయోగ్‌పై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తాజాగా బీజేపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.
Cm Kcr: రాష్ట్రంలో పది లక్షల మంది కొత్తోళ్లకు పంద్రాగస్టు నుంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి 2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.
నీతి ఆయోగ్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ పదునైన విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరుకాలేదు. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ కేసీఆర్ నిర్ణయం దురదృష్టకరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నతస్థాయి సమావేశానికి దూరంగా ఉండటం సరికాదని పేర్కొంది.
Etela Rajender: తెలంగాణలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న బీజేపీలో చేరనున్నారు. చేరికలకు సంబంధించి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని చెప్పారు ఈటల రాజేందర్.
హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టారు.
Munugode ByElection: మునుగోడు ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు టీమ్ తో సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ దూకుడుతో టెన్షన్ పడాల్సిన అధికార టీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది.
Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో మరో మణిహారం అందుబాటులోకి రానుంది. రేపు పోలీస్ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి.
Kcr vs Governer:కొంత కాలంగా ప్రభుత్వానికి ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గవర్నర్ తమిళి సై వజ్రోత్సవ వేడుకల విషయంలోనూ దూకుడుగా వెళుతున్నారు. ఆగస్టు 9నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణి చేస్తుండగా.. అంతకు వారం రోజుల ముందే గవర్నర్ తమిళి సై ప్రారంభించేశారు.
Komatireddy Rajagopal Reddy resigned: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతుందా లేదా ? అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారా లేదా అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అనేక సందేహాలు, చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Rare Seen: తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంటాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో మరీ దారుణంగా ఉంటుంది పార్టీ నేతల తీరు. ఎదురపడినప్పుడు కనీసం పలకరించుకోవటానికి కూడా ఆసక్తి చూపించరు. సీఎం జగన్, చంద్రబాబు మధ్య వైరం గురించి ఎంత చెప్పినా తక్కువే
Telanagana Elections: తెలంగాణాలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన టీఆరెస్ ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.
Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురూచూస్తూ ఏళ్ల తరబడి ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ జాతర పేరుతో ఊరిస్తూ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.