India vs Pakistan 1st Innings Highlights: పాకిస్థాన్ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 50 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. దీంతో 357 పరుగుల లక్ష్యంతో పాక్ జట్టు బరిలోకి దిగనుంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆదివారం వర్షం కారణంగా ఆట నిలిచిపోయిన విషయం తెలిసిందే. 24.1 ఓవర్ల వద్ద టీమిండియా సోమవారం ఇన్నింగ్స్ ఆరంభించింది. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) అర్ధ సెంచరీలతో గట్టి పునాది వేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 16.4 ఓవర్లలో 121 పరుగులు జోడించారు.
సోమవారం ఆట ఆరంభానికి ముందుకు ఔట్ చిత్తడిగా ఉండడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మేఘాలు కమ్ముకుని ఉండడంతో వర్షం పడుతుందేమోనని అనుమనాలు రేకెత్తాయి. వాతావరణం గురించి ఆలోచన వదిలేసి.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించారు. మొదట్ల కాస్త నెమ్మదిగా ఆడగా.. తరువాత గేర్ మార్చారు. సెట్ అయ్యాక ఇద్దరు బ్యాట్స్మెన్లు పాక్ బౌలర్లను భీకరంగా విరుచుకుపడ్డారు.
మొదట కేఎల్ రాహుల్ సెంచరీని పూర్తి చేసుకోవగా.. అనంతరం కింగ్ కోహ్లీ శతకం బాదాడు. రాహుల్ (106 బంతుల్లో 111, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు వదర పారించి.. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 47వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 13 వేల పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే సచిన్ (49) ముందున్నాడు.
Also Read: SBI RD Interest Rates: ఎస్బీఐ ఆర్డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?
Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook