Fact Check On Rs 500 Notes: కేంద్ర ప్రభుత్వం 2016లో పాత పెద్ద నోట్లను రద్దు చేసి.. కొత్త నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక ఊహగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా రూ.500 నోట్లపై ఓ ఫేక్ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల రూ.500 నోట్లు దర్శనమిస్తున్నాయి. రెండు నోట్లకు స్వల్ప తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండు రకాల నోట్లలో ఒకదానిని నకిలీదంటూ కొందరు ఫేక్ వార్తలు సృష్టించారు. దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నోట్ ఒరిజనలో.. ఏది ఫేక్ నోటో అని ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ రకం నోటు నకిలీదని ఈ వీడియోలో చెబుతున్నారు. 500 రూపాయల నోటును తీసుకోకూడదని.. అందులో ఆకుపచ్చ స్ట్రిప్ ఆర్బీఐ గవర్నర్ సంతకం గుండా వెళుతుందని అన్నారు. అదేవిధంగా గాంధీజీ చిత్రానికి చాలా దగ్గరగా ఉందని వీడియోలో చెబుతున్నారు. ఈ వీడియోపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి క్లారిటీ ఇచ్చింది.
ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని పీఐబీ స్పష్టంచేసింది. మార్కెట్లో నడుస్తున్న రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందకండని.. మార్కెట్లో రెండు రకాల నోట్లు నడుస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది.
మీకు కూడా అలాంటి సందేశం వస్తే.. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దు. ఇది కాకుండా.. మీరు ఏదైనా వార్తల విషయంలో ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. దీని కోసం మీరు అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ సందర్శించాలి. అంతేకాకుండా మీరు వాట్సాప్ నంబర్ +91 8799711259 లేదా ఇమెయిల్: pibfactcheck@gmail.com కి మెయిల్ పంపించి క్లారిటీ తెచ్చుకోవచ్చు.
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు
Also Read: Bandi Sanjay: పీఆర్సీ ఏర్పాటు చేయండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి