Sobitha Dhulipala: అచ్చ తెలుగు అందం శోభితా దూళిపాల గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. అందరు ఇంటి గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ ఈ భామ మాత్రం ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో పలకరించబోతుంది. తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్‌లో కనిపించి అభిమానులను కన్నుల విందు చేసింది.
శోభితా ధూళిపాల.. అచ్చ తెలుగు అందం.. ముందుగా హిందీ సినిమా 'రమన్ రాఘవ్ 2.O' మూవీతో కథానాయికగా పరిచయం అయింది.
హిందీ సినిమాతో ప్రారంభమైన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో హీరోయిన్గా తన లక్‌ను పరీక్షించుకుంది.
31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో జన్మించిన ఈమె.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది.
తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
కేవలం సినిమాలే కాదు.. 'మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్' వంటి సిరీస్‌లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం సినిమాలతో పాటు.. యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.