Coronavirus on packaged meat: మాంసంతో కరోనావైరస్.. చైనాకు కొత్తగా మరో టెన్షన్

చైనాకు బీజింగ్, అరెంటినా లాంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే గొడ్డు మాంసం, సౌది అరేబియా నుంచి వచ్చే రొయ్యల మాంసం ప్యాకెట్స్‌పై శాంపిల్స్‌ని పరీక్షించగా అవి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

  • Nov 15, 2020, 17:18 PM IST

బీజింగ్‌: కరోనావైరస్ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే అదే కరోనా చైనాను మరోసారి వణికిస్తోంది. ఈసారి విదేశాల నుంచి బీజింగ్, వూహాన్ నగరాలకు దిగుమతి అయ్యే మాంసం ప్యాకెట్స్ పై కరోనా వైరస్‌ ఉన్నట్టు చైనా గుర్తించింది.

2 /8

ముందుగా ఈ నెల 13న బ్రెజిల్‌ నుంచి వుహాన్‌‌కి వచ్చిన బీఫ్‌ ప్యాకేజింగ్‌లో మూడు నమునాలను కరోనా పాజిటివ్‌‌గా గుర్తించినట్టు వుహాన్‌ మున్సిపల్‌ ఆరోగ్య కమిషన్‌ తన వైబ్‌సైట్‌లో పేర్కొంది. ఆగస్టు 7న బ్రెజిల్ నుంచి కింగ్డావో పోర్ట్‌కు చేరిన ఈ బీఫ్ మాంసం ప్యాక్‌లు అక్కడి నుంచి ఆగస్టు 17న వుహాన్‌కు చేరాయని తెలిపారు.

3 /8

ఆగస్టు 17న బీఫ్ వుహాన్‌కు చేరగా.. అప్పటి నుంచి నుంచి కోల్డ్‌స్టోరేజ్‌లో ఉంచిన బీఫ్‌ని ఇటీవలే బయటికి తీసి కరోనా పరీక్షలు జరిపినప్పుడు ఈ విషయం వెల్లడైనట్టు వుహాన్‌ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. ( Reuters photo )

4 /8

దీంతో వూహాన్ ఫెసిలిటీ సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో వంద మందికిపైగా సిబ్బందికి కరోనావైరస్ పరీక్షలు జరిపారు. ఆ ప్రాంతం నుంచి మరో 200 కరోనా శాంపిల్స్‌ని సేకరించి వైరస్‌ పరీక్షలకు పంపించినట్టు వుహాన్‌ మున్సిపల్‌ ఆరోగ్య కమిషన్‌ స్పష్టంచేసింది. 

5 /8

సౌది అరేబియా నుంచి దిగుమతి అయిన రొయ్యల మాంసం ప్యాకిట్స్‌లోనూ కరోనా ఆనవాళ్లు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ వరుస పరిణామాలు చైనాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ( Reuters photo )

6 /8

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. దేశంలో కరోనాను అంతమొందించినా... అది ఎప్పటికప్పుడు విదేశాల నుంచి దిగుమతి అవుతూనే ఉంటుందనే భయం చైనాను వెంటాడుతోంది.

7 /8

ప్రపంచంలోనే అత్యధికంగా బీఫ్‌ని దిగుమతి చేసుకుంటున్న దేశం చైనా కాగా.. బ్రెజిల్, అర్జెంటినా దేశాలు అత్యధికంగా బీఫ్ ఎగుమతి చేసే దేశాల జాబితాలో ఉన్నాయి.