Bigg Boss Geetu : బిగ్ బాస్ ఇంట్లో ఎవరి ఆట వాళ్లది. ఎవరి స్ట్రాటజీ వాళ్లది. నియమాలు, హద్దులు, ఎత్తులు, పైఎత్తులు ఇలాంటవన్నీ ఉంటాయి. వాటిని పట్టించుకుని ఆడినా, ఆడకపోయినా కూడా మన ప్రవర్తన ఎలా ఉంది.. ఆటలో ఏం చేస్తున్నాం.. మన ఆట మనం ఆడుతున్నామా? పక్కన వాళ్లని గిల్లి ఆడుతున్నామా? అనేది జనాలు చూస్తుంటారు. గలాట గీతూ తానేమో పెద్ద తోపు అన్న భ్రమలో ఉంటుంది. ఫిజికల్ టాస్కులు ఇవ్వండి గుద్ది పడేస్తా అని ఎక్స్ ట్రాలు చేస్తుంటుంది.
కానీ ఇంత వరకు పొడిచిందీ లేదు.. ఆడిందీ లేదు. అందరినీ గెలకడం, అందరి ఆటను చెడగొట్టడం తప్పా ఆమె చేసిందేమీ లేదు. పైగా ఎవరైనా అడ్డు చెబితే అదే తన స్ట్రాటజీ అని అడ్డంగా వాదిస్తుంటుంది. ఇక నిన్నటి కెప్టెన్సీ టాస్కులోనూ గీతూ తన పిచ్చి స్ట్రాటజీని వాడింది. చేపల చెరువు అంటూ బిగ్ బాస్ సమయాను సారంగా చేపలను పై నుంచి విసిరేస్తుంటాడు. వాటిని పట్టుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఇద్దరిద్దరినీ టీంలు విడగొట్టాడు బిగ్ బాస్.
ఆదిరెడ్డి, గీతూలను ఒక టీంలో పడేశాడు. అయితే గీతూ మాత్రం తను ఆట ఆడాల్సింది పోయి.. పక్కన వాళ్లను రెచ్చగొడతా.. వాళ్లు తిట్టేలా చేస్తా.. దీంతో వాళ్లు అంతగా ఆట ఆడలేరు.. చేపలను పట్టుకోలేరు అంటూ పిచ్చి స్ట్రాటజనీ వాడింది. మెరినా, కీర్తి, రేవంత్ ఊరికే అలా కోప్పడతారు.. నేను వాళ్లను రెచ్చగొడతుంటాను. నువ్వెళ్లి చేపలు పట్టుకో అని ఆదిరెడ్డికి తన కుళ్లు ఆలోచనను చెప్పింది గీతూ.
చేపలను పట్టుకునేంత సత్తా లేని గీతూ.. చివరకు తన స్ట్రాటజీని వాడింది. రేవంత్, మెరినా ఇలా అందరినీ మాటలతో రెచ్చగొట్టేసింది. అయితే రేవంత్, బాలాదిత్య ఇలా చాలా మంది తమకు దొరికిన వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. కానీ గీతూ మాత్రం అందరి వద్ద వెళ్లి లాక్కోవాలని ప్రయత్నించింది. దీంతో మొదటికే మోసం వచ్చినట్టు అయింది. గీతూ ఒకరి వద్ద లాగితే.. అందరూ కలిసి గీతూ, ఆదిరెడ్డిల వద్ద ఉన్న చేపలను లాగేసుకున్నారు.
అలా చివరకు ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది గీతూ, ఆదరెడ్డికి. పక్క వాళ్లవి వద్దు.. ముందు మనవి మనం సేవ్ చేసుకుందాం.. గీతక్కా.. పిచ్చిదానా అంటూ ఇలా ఆదిరెడ్డి ఎంత అరిచినా కూడా గీతూ వినలేదు. చివరకు తన స్ట్రాటజీతో బొక్క బోర్లా పడింది. ఆటలోంచి గీతూ, ఆదిరెడ్డి తప్పుకున్న తరువాత కూడా రేవంత్, బాలాదిత్యల మీద కౌంటర్లు వేసుకుంటూ ఉన్నారు. బాలాదిత్య, రేవంత్‌లు అసలు ఆటే ఆడలేదు.. వాళ్లు వాళ్లవి మాత్రమే కాపాడుకున్నారు అని గీతూ, ఆదిరెడ్డి రివ్యూలు ఇచ్చుకుంటూ ఉన్నారు.
రేవంత్, బాలాదిత్యే వద్దే ఎక్కువ ఉన్నాయ్.. వాళ్లు గెలిచారు.. తమ వద్ద తక్కువ ఎందుకున్నాయ్.. ఎందుకు ఓడిపోయారన్నది మాత్రం గుర్తించడం లేదు. అలా పక్కన వారు బాగా ఆడినా కూడా గీతూ మాత్రం ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. గీతూ ఆడ లేక.. వాళ్లని కూడా తన దారిలోనే ఆడమనేట్టుగా ఉంది. ఇదంతా చూస్తుంటే.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా గీతూ వ్యవహారం ఉంది. గీతూ తానేదో ఆటల్లో తోపు అనే భ్రమల్లోనే ఉంటోంది. ఆమె ఆట తీరు గానీ మాట తీరు గానీ ఏది కూడా జనాలను ఆకట్టుకోవడం లేదు. గీతూ చివరి వరకు ఉంటే ఉండొచ్చు గానీ.. ఇలాంటి కంటెస్టెంట్ మాత్రం విన్నర్ అయ్యేందుకు చాలా తక్కువ అవకాశాలే ఉంటాయి.
Also Read : Samantha Face Surgery : సమంత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ?.. ఆ ఫోటోలతోనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయా?
Also Read : Poorna Marriage: నటి పూర్ణ పెళ్లి.. ఫొటోలు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి