Horoscope Today June 26th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తస్మాత్ జాగ్రత్త.. శత్రువు మెరుపు దాడి చేసే ఛాన్స్..

Horoscope Today June 26th 2022: ఈరోజు ఆదివారం. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజున హిందువులంతా ఆ సూర్యభగవానుడిని పూజిస్తారు. రాశిచక్రంలో ఇవాళ 12 రాశుల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2022, 07:17 AM IST
  • ఇవాళ కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన రోజు
  • వ్యాపారులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి అనుకూలమైన రోజు
  • ఇవాళ ఏయే రాశుల వారికి ఇంకా ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today June 26th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తస్మాత్ జాగ్రత్త.. శత్రువు మెరుపు దాడి చేసే ఛాన్స్..

Horoscope Today June 26th 2022: ఇవాళ ఆదివారం. భక్తి, శ్రద్ధలతో సూర్యభగవానుడిని కొలిచే రోజు. సూర్యుడు శని దేవుడి తండ్రి. శని విముక్తి పొందేందుకు సూర్య అనుగ్రహం కూడా తోడ్పడుతుంది. అందుకే సూర్య భగవానుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేస్తారు. ఇవాళ రాశిచక్రంలోని 12 రాశుల జాతక ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశి (Aries)

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మెరుపు దాడి చేయవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే ముందు అన్ని వివరాలు తెలుసుకోండి, నిపుణులను సంప్రదించండి. విద్యార్థులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారంలో పాత పెట్టుబడుల నుండి ధనలాభం లభిస్తుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి (Taurus)

బట్టల వ్యాపారులకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మార్పు ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంటారు. లవ్‌మేట్ నుంచి ఖరీదైన బహుమతులు పొందుతారు. లవ్‌మేట్‌తో కొన్ని విషయాల్లో వివాదాలు తలెత్తవచ్చు. విద్యాపరమైన పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు.

మిథున రాశి (GEMINI)

మతపరమైన పనుల పట్ల మొగ్గు చూపుతారు. సామాజిక హోదా, ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అనవసర ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. సాయంత్రం కుటుంబ సమేతంగా మతపరమైన ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు.

కర్కాటక రాశి (Cancer) 

కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో ఆశించిన విధంగా లాభం ఉంటుంది. చాలాకాలంగా రాకుండా నిలిచిపోయిన బకాయి సొమ్ము వసూలవుతుంది. ఈ రోజు మీరు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికను రూపొందించుకుంటారు. లవ్‌మేట్ నుంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

సింహ రాశి (LEO)

ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆ కారణంగా కుటుంబంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వ్యాపారంలో లాభాలను ఆర్జించడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు.

కన్య రాశి (Virgo)

ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. సోదరుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. వ్యాపార పరంగా ఇవాళ చాలా మంచి రోజు. మీ జీవిత భాగస్వామితో కలిసి నైట్ డిన్నర్‌కు బయటకు వెళ్లే అవకాశం. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.

తులా రాశి (Libra)

ఆకస్మిక ధనలాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేకుంటే వివాదం ఉండవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈరోజు అనుకూలం.అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లిస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio)

మనసు ఆనందంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం రావచ్చు. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. జాగ్రత్తగా ఉండండి, మీ కోపాన్ని నియంత్రించుకోండి, లేకపోతే లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. 

ధనుస్సు రాశి (Sagittarius)  

మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పురోగతి సాధ్యమవుతుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. కార్యాలయంలో అధికారులతో సమన్వయం పాటించండి. వ్యాపార నిమిత్తం పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మకర రాశి (Capricorn) 

ఈ రోజు మీ అదృష్టం 80 శాతం కలిసొస్తుంది. మీ చతురతతో పాత వివాదాలను పరిష్కరించుకోవచ్చు. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. కుటుంబంలో ఎవరికైనా వివాహ సంబంధం రావచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈరోజు అనుకూలం. ప్రియురాలు లేదా ప్రియుడితో పెళ్లి ప్రస్తావన ఉంటుంది.

కుంభ రాశి (Aquarius)

ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కష్టపడి పనిచేయాల్సి రావొచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేకపోతే నష్టం జరగవచ్చు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.

మీన రాశి (Pisces) 

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబ కలహాలు ఉండవచ్చు. వ్యాపారంలో అధిక శ్రమ అవసరమవుతుంది. చాలాకాలంగా కలవాలనుకుంటున్న పాత స్నేహితుడు ఒకరిని కలుస్తారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు శుభదినం. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read:Athmakuru Bypoll Result: నేడే ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం.. వైసీపీ లక్ష మెజారిటీ సాధించేనా..?

Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News