రాజా ది గ్రేట్ ఫస్ట్‌డే కలెక్షన్లు.. 10 కోట్లు

  

Last Updated : Oct 19, 2017, 08:00 PM IST
రాజా ది గ్రేట్ ఫస్ట్‌డే కలెక్షన్లు.. 10 కోట్లు

మాస్ మహరాజా రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం బాక్సాఫీసు వద్ద బాగానే దూసుకుపోతోంది. బుధవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 10 కోట్లు దాటాయని సమాచారం. కేవలం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ చిత్రం బాగానే వసూళ్లను రాబడుతోంది. అమెరికాలోనే ఈ సినిమా కలెక్షన్లు తొలిరోజు 84 లక్షలు దాటాయి.

రవితేజ సరసన మెహ్రీన్ పర్జాదా నటించినఈ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చారు. రాశిఖన్నా ఒక ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సాయికుమార్, సంపత్ రాజ్ మిగతా పాత్రల్లో నటించారు.

రవితేజ అంధుడిగా నటించిన ఈ చిత్రం మంచి యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తొలి రోజు టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మరో చిత్రం"టచ్ చేసి చూడు" సెట్స్ పైకి వెళ్లనుంది. నల్లమలుపు బుజ్జి నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి విక్రమ్ శ్రీకొండ దర్శకత్వం వహించనున్నారు. 

Trending News