TS PECET 2021 results: పీఈసెట్ రిజల్ట్స్ 2021 విడుదల

TS PECET 2021 results declared: పీఈ సెట్ పరీక్షలకు హాజరైన వారిలో 96.99 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2021, 11:40 AM IST
TS PECET 2021 results: పీఈసెట్ రిజల్ట్స్ 2021 విడుదల

TS PECET 2021 results declared: హైదరాబాద్‌ : తెలంగాణలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి సోమవారం పీఈ సెట్ ఫలితాలు విడుదల చేశారు. పీఈ సెట్ పరీక్షలకు హాజరైన వారిలో 96.99 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారని లింబాద్రి తెలిపారు. డీపీఈడీకి 1,207 మంది అర్హత సాధించినట్టు లింబాద్రి వెల్లడించారు.

పీఈసెట్‌ రాసిన అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే టాప్ ర్యాంక్స్ సొంతం చేసుకున్నారు. పీఈసెట్ ఫలితాల్లో (TS PECET results 2021) బీపీఈడీలో ఖమ్మం విద్యార్థిని అంగోతు కృష్ణవేణి మొదటి ర్యాంక్‌ కైవసం చేసుకోగా.. బి.రమేశ్‌ రెండో ర్యాంక్‌‌లో నిలిచారు. డీపీఈడీలో భూపాలపల్లి నుంచి గాజుల సృజన్‌ మొదటి ర్యాంక్‌ సొంతం చేసుకోగా.. తుంగ అనూష రెండో ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు.

Trending News