Bank Accounts close: అవ‌స‌రం లేని బ్యాంకు ఖాతాల్ని సులభంగా క్లోజ్‌ చేసుకోండి ఇలా...డీ లింక్ చేయడం మర్చిపోకండి

Close Unused Additional Bank Account : మినిమమ్ బ్యాలెన్స్ లేక‌పోతే ఛార్జీలు ప‌డతాయి. అలాగే క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. ఇలా చాలా బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ విధానాన్ని పాటించడం వల్ల వీలైనంత వరకూ మనకు ఉన్న అనసర బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయడమే బెస్ట్.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 06:39 PM IST
  • ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే అనేక ఇబ్బందులు
  • అవసరం లేని బ్యాంకు ఖాతాలను క్లోజ్‌ చేయడం బెస్ట్
  • డీ లింక్ చేసి క్లోజ్ చేస్తే బెస్ట్
Bank Accounts close: అవ‌స‌రం లేని బ్యాంకు ఖాతాల్ని సులభంగా క్లోజ్‌ చేసుకోండి ఇలా...డీ లింక్ చేయడం మర్చిపోకండి

How to Close The Unused Additional Bank Accounts : చాలా మందికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలుంటాయి. ఉద్యోగాలు మారిన‌ప్పుడల్లా బ్యాంకు ఖాతా (Bank account) మారుతూ ఉంటుంది. అయితే కొత్త ఖాతా ఓపెన్‌ చేసినప్పుడల్లా పాత‌ది క్లోజ్‌ చేస్తే చాలా మేలు. ఎందుకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే క‌నీస నిల్వ‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. వాటితో ఎలాంటి రాబ‌డి కూడా ఉండ‌దు. 

మినిమమ్ బ్యాలెన్స్

అంతేకాదు ఎక్కువ ఖాతాలుంటే వాటిని రెగ్యులర్‌‌గా చెక్ చేయాలన్నా కూడా కష్టమే. అలాగే మినిమమ్ బ్యాలెన్స్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎస్‌బీఐ ఖాతాను మెయింటెన్ చేయాలంటే మెట్రో, న‌గ‌ర ప్రాంతాల్లో రూ.3,000 క‌నీస నిల్వ ఉండాలి. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రూ.2,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 మినిమమ్ బ్యాలెన్స్ అవసరం. మినిమమ్ బ్యాలెన్స్ (Minimum balance) లేక‌పోతే ఛార్జీలు ప‌డతాయి. అలాగే క్రెడిట్ స్కోర్‌పై (credit score) కూడా ప్ర‌భావం ప‌డుతుంది. ఇలా చాలా బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ విధానాన్ని పాటించడం వల్ల వీలైనంత వరకూ మనకు ఉన్న అనసర బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయడమే బెస్ట్.

డీ లింక్ చేయాలి

అయితే మీరు క్లోజ్‌ చేయాలనుకున్న బ్యాంకు అకౌంట్‌ ఏదైనా చెల్లింపుల సేవ‌ల‌కు లింక్ అయి అంటే ఉంటే డీ లింక్ చేయాలి. అంటే ఫండ్స్ ఇండియా, పేటీఎం, స్విగ్గీ, ఉబ‌ర్ వంటి ఖాతాల‌కు ఆ బ్యాంకు అకౌంట్ అనుసంధానమై ఉంటే దాన్ని డీ-లింక్ (d link) చేయాలి.యుపీఐ పేమెంట్స్ మీ ఫోన్‌తో అనుసంధానమై ఉంటాయి కాబట్టి మొద‌ట వాటిని డీ-లింక్ చేయాలి. అయితే కొన్ని ప్లాట్‌ఫాంలు ఇందుకు డీ-లింక్ ఫామ్‌ను కూడా అడుగుతాయి.

బ్యాంకుల నుంచి ఖాతా క్లోజ‌ర్ ఫామ్

చాలా బ్యాంకులు ఖాతా క్లోజ‌ర్ ఫామ్‌ను (closure form) అందిస్తాయి. బ్యాంకు బ్రాంచ్‌ లేదా వెబ్‌సైట్ ద్వారా క్లోజర్ ఫామ్ పొందొచ్చు. ఇక జాయింట్ అయితే అందుకు ఖాతాదారులంతా స‌మ్మ‌తి తెలపాల్సి ఉంటుంది.

Also Read : దేశ సాంప్రదాయానికి అవమానం.. చీర కట్టుకున్నందుకు హోటల్లో నో ఎంట్రీ..!నెటిజన్లు ఆగ్రహం

డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చేయాలి

బ్యాంకు జారీ చేసిన‌ ఉప‌యోగించ‌ని చెక్కు బుక్కుల‌ను (checkbooks), డెబిట్‌, క్రెడిట్ కార్డ్స్, పాస్‌బుక్‌లతో పాటు అన్ని రకాల డాక్యుమెంట్ల‌ను బ్యాంకుకు తిరిగి ఇచ్చి వేయాల్సి ఉంటుంది. ఖాతా క్లోజ‌ర్ ఫారంతో పాటు ఇవ‌న్నీ ఇవ్వాల్సి ఉంటుంది.

ముగింపు ఛార్జీలు 

అయితే ఖాతా ప్రారంభించిన ఏడాదిలోగే మూసేస్తే బ్యాంకులు ముగింపు ఛార్జీల‌ను (closing charges) వ‌సూలు చేస్తాయి. ఎస్‌బీఐ ఖాతా ప్రారంభించిన 14 రోజుల్లో మూసివేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే 15 వ రోజు నుంచి ఏడాదిలోపు మూసివేస్తే రూ.500 ఛార్జీల‌తో పాటు జీఎస్‌టీ (GST) కలిపి వసూలు చేస్తుంది. అయితే ఏడాది దాటితే ఎలాంటి రుసుములు ఉండ‌వు.

అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి

కాగా ఆర్‌బీఐ (RBI) నిబంధ‌న‌ల ప్ర‌కారం బ్యాంకులు స్వ‌తంత్రంగా ఈ ముగింపు ఛార్జీల‌ను విధించుకునే వీలుంది. అయితే బ్యాంకుకు చెల్లించాల్సిన‌ ఏవైనా పెండింగ్ ఛార్జీలు ఉంటే వాటిని చెల్లించి ఖాతా క్లోజ్ చేసినట్లు బ్యాంకు వ‌ద్ద‌ అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా స‌రైన విధానంలో అవ‌స‌రం లేని ఖాతాల‌న్నీ క్లోజ్ చేసుకుంటే బ్యాంకు ఖాతాల (bank accounts) విషయంలో టెన్షన్ పడకుండా ఉండొచ్చు.

Also Read : ZEEL-Sony merger updates: జీల్, సోని పిక్చర్స్ విలీనంతో పైపైకి ZEEL shares

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News