AP Roads: ఆంధ్రప్రదేశ్‌లో నరకప్రాయంగా మారిన రోడ్ల నుంచి త్వరలో విముక్తి కలగనుంది. రోడ్ల మరమ్మత్తు పనుల్ని యుద్ద ప్రాతిపదికన భారీ ఎత్తున చేపట్టనుంది ప్రభుత్వం. 2 వేల కోట్లతో మరమ్మత్తు పనుల కోసం టెండర్ నోటిఫికేషన్ వెలువడింది.
ఏపీలో భారీ వర్షాలు( Heavy Rains), తుపాన్ల కారణంగా రహదారులు బాగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిన పరిస్థితి. రోడ్ల దుస్థితి ( Damages Roads) కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో భారీ ఎత్తున రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో 7 వేల 969 కిలోమీటర్ల మేరక రోడ్లకు ప్రత్యేక మరమ్మత్తులు చేసేందుకు టెండర్ నోటిఫికేషన్ (Tender Notification) విడుదల చేయాలని ఆర్ అండ్ బీ శాఖను ప్రభుత్వం ( Ap government) ఆదేశించింది. కేవలం నెలరోజుల్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్ధలతో అగ్రిమెంట్లు పూర్తి చేయాల్లి ఉంటుంది. 2 వేల 205 కోట్లతో రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తు పనులకు ఇప్పటికే పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. గత యేడాది వేయి కోట్లతో రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈసారి రెన్యువల్ లేయర్ వేసేందుకు 2 వేల 205 కోట్లు కేటాయించారు. యుద్ధప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
2 కోట్లలోపు పనులకు జిల్లా పరిధిలోనే ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యాన టెండర్లు నిర్వహిస్తారు. 2 కోట్ల కంటే ఎక్కువుంటే రాష్ట్రస్థాయిలో టెండర్లు జరగనున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయి పనులకు రివర్స్ టెండర్లు జరుగుతాయి. ఏప్రిల్ నెలలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మరమ్మత్తు పనులు ప్రారంభించనున్నారు.
Also read: Kodali nani: చంద్రబాబుపై మరోసారి విరుచుకపడ్డ మంత్రి కొడాలి నాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook