భారతదేశంలో చాలావరకు స్టేడియాలు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. అరుదుగా గవాస్కర్, సచిన్, గంగూలీ ఆటగాళ్ల పేర్లమీద స్టేడియాలు ముంబై, కోల్కతా నగరాలలో కనిపిస్తాయి. మరి అమెరికాలో మన భారతీయ క్రీడాకారుడి పేరుమీద స్టేడియం ఉంటే ? తన పేరుమీద నిర్మితమైన ఆ స్టేడియాన్ని భారత క్రికెటర్ అక్టోబర్ నెలలో ఆరభించనున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రం కెంటకీలోని లూయిస్ విల్లేలో కొత్తగా నిర్మితమైన స్టేడియానికి భారత క్రికెటర్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట "సునీల్ గవాస్కర్ ఫీల్డ్" అని పేరు పెట్టారు. అమెరికా స్టేడియానికి భారత క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. "కేవలం ఆటగాళ్ల పేర్ల మీదే కాకుండా.. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని కూడా గౌరవించాలి" అని గవాస్కర్ చెప్పారు.
గవాస్కర్ 125 టెస్ట్ మ్యాచులు, 108 అంతర్జాతీయ వన్డే (ఒడిఐ) లు ఆడారు. టెస్ట్ మ్యాచుల్లో 10122 పరుగులు, ఒడిఐ 3092 పరుగులు చేశారు. టెస్ట్ మ్యాచుల్లో 34 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలు పూర్తిచేశారు.