Epfo Good News: ప్రతి ప్రైవేటు ఉద్యోగి గంతేసే వార్త.. ప్రతి నెల EPF నుంచి రూ.9,000 పెన్షన్ పొందండి..

Epfo New Pension Scheme: ప్రైవేటు ఉద్యోగులు పదవి విరమణకు ముందే EPFO సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ అందిస్తోంది. ఈ పథకం కింద దాదాపు ప్రతి నెల తగిన పెన్షన్‌ పొందవచ్చు. అయితే దీనిని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. 
 

Epfo New Pension Scheme: EPFOలో ప్రైవేటు ఉద్యోగులకు అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో పదవి విరమణ పొందిన ప్రేవేటు ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్‌ పథకాలు ఇంకెన్నో ఉన్నాయి. చాలా మంది ప్రైవేటు ఉద్యోగులకు ఈ EPFO అందించే పెన్షన్‌ పథకాల గురించి అస్సలు తెలియదు.. అయితే ప్రతి ఒక్క పిఎఫ్‌ ఖాతాదారుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఓ పెన్షన్‌ పథకం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం.
 

1 /8

ప్రైవేటు ఉద్యోగులు పదవి విరమణ తర్వాత కూడా ప్రతి నెల తగిన పెన్షన్‌ పొందవచ్చు. దీనిని సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ ద్వారా పొందవచ్చు. అయితే ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా ప్రతి నెల పెన్షన్‌ పొందే సదుపాయాన్ని అందిస్తోంది.  

2 /8

EPFO అందించే అద్భతమైన పథకాల్లో భాగంగా ఈ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ (EPFO Superannuation Pension) ఒకటి.. అయితే ఈ పెన్షన్‌ పొందడానికి ముందుగా ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో తప్పకుండా జీతంలో కొంతైనా EPF పెన్షన్ నిధికి జమ చేయాల్సి ఉంటుంది.

3 /8

ఇలా పెన్షన్‌ నిధికి జామ చేసి.. దాదాపు ఉద్యోగికి 58 సంవత్సరాలు నిండిన తర్వాత పదవి విరమణ పొందితే ఈ సూపర్‌యాన్యుయేషన్ పథకం ద్వారా ప్రతి నెల పెన్షన్‌ లభిస్తుంది. 

4 /8

ఈ సూపర్‌యాన్యుయేషన్ పథకం కింద ఉద్యోగి తప్పకుండా EPFO (Employees' Provident Fund Organisation) నిధికి దాదాపు జీతంలో 12 శాతం వరకు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రతి నెల ప్రత్యేకమైన పెన్షన్‌ లభిస్తుంది.  

5 /8

ఈ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ (EPFO Superannuation Pension) పొందడానికి EFO ఇటీవలే కొన్ని నిబంధనలను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ పెన్షన్‌ పొందాలంటే తప్పకుండా ఉద్యోగి కనీసం దాదాపు 10 ఏళ్లైనా జాబ్‌ చేయాల్సి ఉంటుంది.   

6 /8

అలాగే ఈ సూపర్‌యాన్యుయేషన్ పథకం ద్వారా పెన్షన్‌ పొందడానికి ఉద్యోగి తమ జీతం నుంచి దాదాపు రూ.500 అయినా.. EPFO పెన్షన్‌ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పెన్షన్‌ కింద ప్రతి పదవి విరమణ చేసిన ప్రైవేటు ఉద్యోగి రూ.9,000 పెన్షన్ పొందవచ్చు. 

7 /8

సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ పొందడానికి.. ఏ ఉద్యోగైతే ఈ పెన్షన్ పథకం కింద పెన్షన్‌ పొందాలనుకుంటున్నాడో.. ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు EPFO కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

8 /8

సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ (EPFO Superannuation Pension) అనేది ఉద్యోగి జీతం నుంచి జమ చేసిన డబ్బును అధారంగా తీసుకుని.. EPFO ప్రత్యేకమైన పెన్షన్‌ను అందిస్తుంది. పదవి విరమణ తర్వాత ఉద్యోగులు ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.