Australia vs India 1st Test: తొలి టెస్ట్‌లో దెబ్బ తీసిన కంగారులు.. కుప్పకూలిన భారత్

India Vs Australia 1st Test Highlights: తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టడంతో టీమిండియా 150 రన్స్‌కే కుప్పకూలింది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై కంగారులు రెచ్చిపోయారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Nov 22, 2024, 02:21 PM IST
Australia vs India 1st Test: తొలి టెస్ట్‌లో దెబ్బ తీసిన కంగారులు.. కుప్పకూలిన భారత్

India Vs Australia 1st Test Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా తడపడింది. సొంతగడ్డపై ఆసీస్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో భారత్ కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అత్యధికంగా 41 పరుగులు చేయగా.. రిషభ్‌ పంత్ (37) రాణించగా, కేఎల్ రాహుల్ (26) పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు. యశశ్వి జైస్వాల్, పడిక్కల్ డకౌట్ అయ్యారు. విరాట్ కోహ్లీ (5), ధ్రువ్ జురెల్ (11), వాష్టింగ్టన్ సుందర్ (4) నిరాశ పరిచారు.  టాస్ గెలిచిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

Also Read: Hanuman idol: తెలంగాణలో మరో దారుణం.. హనుమాన్ విగ్రహం దగ్ధం.. అసలు కారణం ఏంటంటే..?

రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సహనంతో బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ జైస్వాల్, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ పడిక్కల్ డకౌట్ అవ్వగా.. కోహ్లీ ఐదు పరుగులకే ఔట్ పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ఆసీస్‌ బౌలర్లను కాసేపు గట్టిగానే కాచుకున్నాడు. అయితే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అనూహ్యంగా వివాదస్పద రీతిలో ఔట్ అయ్యాడు. బంతి ఎడ్జ్‌కు తాకలేదని ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఆసీస్‌ ప్లేయర్లు రివ్యూ కోరారు. రిప్లైలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్ ఔట్ అయినట్లు ప్రకటించారు. 

అయితే సమీక్షలో బ్యాట్‌ను బంతి తాకినట్లు కనిపించలేదు. ప్యాడ్‌ను బ్యాట్ తాకడంతో స్ట్రైక్స్ వచ్చాయి. ఈ స్ట్సైక్స్‌ గమనించి థర్డ్ అంపైర్ ఔట్ అని చెప్పడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. బ్యాట్‌కు బాల్ అస్సలు తాకలేదంటూ ఫీల్డ్ అంపైర్‌కు చెబుతూ.. నిరాశగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు కేఎల్ రాహుల్. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పూర్తిగా పరిశీలించకుండానే నిర్ణయం వెలువరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇక తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌ కూడా ప్రస్తుతం చిక్కుల్లోనే ఉంది. కెప్టెన్ బుమ్రా రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. బమ్రా దెబ్బకు ఉస్మాన్ ఖవాజా (8), నాథన్ మెక్‌స్వీనీ (10), స్టీవ్ స్మిత్ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. అరంగేట్ర బౌలర్ ట్రావిస్ హెడ్‌ను డకౌట్ చేసి టెస్టుల్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లో లబూషేన్ (1), మిచెల్ మార్ష్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఇదే ఊపును కొనసాగిస్తే.. ఆసీస్‌ కూడా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News