రానున్న 3 రోజులపాటు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Last Updated : Oct 4, 2019, 04:00 PM IST
రానున్న 3 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్‌: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న గురువారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

Trending News