Egg Spinach Salad: ఎగ్‌ స్పీనచ్‌ సలాడ్‌ రిసిపీ.. ఇలా చేస్తే లంచ్‌లోకి యమ్నీగా తినవచ్చు..

Egg Spinach Salad Recipe: ఇప్పటి వరకు కేవలం గుడ్లలతో కూర, అమ్లేట్‌, బూర్జీ వంటివి చేసుకున్నాం. ఈసారి హెల్తీగా కొత్తగా ఏదైనా రిసిపీ తయారు చేయాలనుకుంటే ఇది మీకు బెస్ట్‌ ఎందుకంటే ఎగ్‌ స్పీనాచ్‌ సలాడ్‌ రిసిపీ యమ్నీగా ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jul 7, 2024, 07:36 PM IST
Egg Spinach Salad: ఎగ్‌ స్పీనచ్‌ సలాడ్‌ రిసిపీ.. ఇలా చేస్తే లంచ్‌లోకి యమ్నీగా తినవచ్చు..

Egg Spinach Salad Recipe: మీకు ఆకలిగా వేస్తున్న త్వరగా ఏదైనా సలాడ్ చేసుకుని తినాలని అనిపిస్తుందా? అది కూడా ఆరోగ్యకరంగా అయితే మీ ఇంట్లో ఒక పాలకూర కట్ట ఉంటే చాలు. దీంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సలాడ్ తయారు చేసుకోవచ్చు. దీనిని మీకు కావాల్సిన దానిలా పాలకూర ఉడకబెట్టిన గుడ్లు కాస్త మసాలాలు జోడించి లంచ్ లేదా డిన్నర్ లోకి తీసుకుంటే యమ్మీగా ఉంటుంది ఈ ఎగ్స్ పీనట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇప్పటి వరకు కేవలం గుడ్లలతో కూర, అమ్లేట్‌, బూర్జీ వంటివి చేసుకున్నాం. ఈసారి హెల్తీగా కొత్తగా ఏదైనా రిసిపీ తయారు చేయాలనుకుంటే ఇది మీకు బెస్ట్‌ ఎందుకంటే ఎగ్‌ స్పీనాచ్‌ సలాడ్‌ రిసిపీ యమ్నీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యకరం, రుచిగా కూడా ఉంటుంది. ఇందులో మనం పాలకూర కూడా వేసుకుంటాం. కాబట్టి ఇందులో విటమిన్ ఏ, ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా కళ్లు, జుట్టుకు ఎంతో ముఖ్యం. ఈ రెండిటినీ కలిపి యమ్మీ టేస్టీ ఎగ్‌ స్పీనచ్‌ సలాడ్‌ తయారు చేసుకుందాం.

ఎగ్‌ స్పీనచ్‌ సలాడ్‌ రిసిపీకి కావలసిన పదార్థాలు
గుడ్లు -4
 ఒక పాలకూర కట్ట 
ఉడకబెట్టిన బంగాళదుంపలు -150 గ్రాములు 
చీజ్-1/2 కప్పు 
కొత్తిమీర 
మిరియాలు -1/2 టేబుల్ స్పూన్ 
ఉప్పు -రుచికి సరిపడా 
ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ - 2 tbsp 
వెల్లుల్లి -4 రెబ్బలు
నీళ్లు సరిపడనంత

ఇదీ చదవండి: ఘుమఘుమలాడే పుదీనా చికెన్‌.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..

ఎగ్స్ పీనట్ సలాడ్ తయారీ విధానం
ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ వేసి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేసి అవి ఉడికే ఉడికించుకోవాలి. ఈలోగా మరో ప్యాన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లోనే కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని బంగాళదుంపలు చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత పాలకూర మిగతా మసాలాలు చీజ్ కూడా వేసి బాగా టాస్ చేసుకొని ఉడికించుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇందులోనే ఉడకబెట్టిన గుడ్లు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. పైనుంచి ఉప్పు మిరియాల పొడి జల్లుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన ఎగ్స్ స్పీనచ్ రెడీ అయిపోతుంది.

 

ఇదీ చదవండి: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీ కోసమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News