ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఈ సందర్భంగా గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా 59 లక్షల 18 వేల దొంగ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడంతోపాటు వైఎస్సార్సీపీకి అండగా నిలిచే అసలు ఓట్లను తొలగించారని వైఎస్ జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఏపీ సర్కార్ చేపట్టిన పోలీస్ అధికారుల పదోన్నతుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, ఆయా పదోన్నతులపై విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు జగన్ విజ్ఞప్తి చేశారు.