Dirty Fellow: విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించిన 'డర్టీ ఫెలో' మూవీ ట్రైలర్..

Dirty Fellow: శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో  రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్  పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి  హిరో హీరోయిన్లుగా నటించిన మూవీ 'డర్డీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించారు

Written by - TA Kiran Kumar | Last Updated : May 17, 2024, 07:26 PM IST
Dirty Fellow: విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించిన 'డర్టీ ఫెలో' మూవీ ట్రైలర్..

Dirty Fellow: అంతా కొత్తవాళ్లతో రాజ్ ఇండియా ఎంటర్టైర్మెంట్ పతాకంపై తెరకెక్కిన చిత్రం 'డర్టీ ఫెలో'. ఈ నెల 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా సంస్థ కార్యాలయంలో  ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వంభర దర్శకుడు వశిష్ఠ దర్శకుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో శాంతి చంద్ర, చిత్ర దర్శకులు మూతర్తి సాయి అడారి మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఈ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యాయి.

దర్శకులు మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ..

శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది.  మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.  

చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ..
మా 'డర్టీఫెలో' సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి టిమ్ ని అభినందించిన మల్లిడి వశిష్ఠకి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.

చిత్ర దర్శకులు మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ..
'డర్టీ ఫెలో' ట్రైలర్ ను దర్శకులు వశిష్ఠ ఆవిష్కరించడం చాలా సంతోషకంగా ఉందన్నారు. మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.

నటి నటులు:
శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : శ్రీమతి గుడూరు భద్ర కాళీ
బ్యానర్ : రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : జి.యస్. బాబు.
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆడారి మూర్తి సాయి
డి. ఓ. పి : రామకృష్ణ. యస్.
మ్యూజిక్: డాక్టర్. సతీష్ కుమార్.పి.
ఎడిటర్ : జేపీ
ఫైట్స్ : శంకర్
కొరియోగ్రఫీ : కపిల్ & ఈశ్వర్

ఇదీ చదవండి:  వ్యాపారం చేయడానికి రూ. 5000 వేలు కూడా లేనివ్యక్తి.. నేడు రూ. 16,900 కోట్లకు అధిపతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News