Type 2 Diabetes: ఉప్పు తినేవారికి షాకింగ్‌..ఇలా తింటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది!

Type 2 Diabetes: ఉప్పును మోతాదుకు మించి వినియోగించడం వల్ల మధుమేహం వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనాలు తెలిపాయి. అంతేకాకుండా దీని కారణంగా కొంతమందిలో అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 03:11 PM IST
Type 2 Diabetes: ఉప్పు తినేవారికి షాకింగ్‌..ఇలా తింటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది!

 

Type 2 Diabetes: ఉప్పులేని ఆహారాల తినడం చాలా కష్టం..వంటకాల రుచిని రెట్టింపు చేసేందుకు ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. సోడియం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కానీ చాలా మంది సోడియం కూడిన ఉప్పును అధిక పరిమాణంలో వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం వల్లే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి చక్కెరతో పాటు ఉప్పు కూడా చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఉప్పు అతిగా తీసుకోవడం వల్ల కూడా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. తాజా అధ్యయనం  ప్రకారం..ప్రతి రోజు టేబుల్ సాల్ట్‌ను వినియోగించడం వల్ల టైప్ 2 మధుమేహానికి దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

అధ్యయనం ఏం చెబుతోందంటే?
ఓ యూనివర్శిటీకి చెందిన కొత్త అధ్యయనంలో ఆహారంలో అదనపు ఉప్పును ప్రతి రోజు వినియోగించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రావచ్చని కనుగొంది. ఈ అధ్యయనం బ్రిటన్‌లోని 400,000 కంటే ఎక్కువ మందిపై సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా ఐదు వర్గాలుగా విభజించగా..ప్రతి రోజు ఉప్పును తీసుకునేవారే సులభంగా మధుమేహం బారిన పడ్డారని తేలింది. ఉప్పుపై చేసిన సర్వేను క్లుప్తంగా మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో పేర్కొన్నారు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఉప్పు వల్ల మధుమేహం ఎలా వస్తుందో తెలుసా?
అధిక పరిమాణంలో ప్రతి రోజు ఉప్పును వినియోగించడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌కు ఎలా దారితీస్తుందో అని అధ్యయనంలో ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మాత్రం అతిగా ఉప్పును తీసుకోవడం వల్లే మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ ఉప్పు వల్ల చాలా మందిలో వాపు సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. 

ఉప్పు అతిగా వినియోగించే ముందు జాగ్రత్త:
ఉప్పు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సోడియం అధిక పరిమాణంలో ఉండే సాల్ట్‌ కంటే ఇతర ఉత్పత్తులను వినియోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉండే నిమ్మ ఉప్పు ఇతర పదార్థాలను వినియోగించడం చాలా మంచిది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News