Barley Water Benefits: ఆధునిక జీవనశైలిలో భాగంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిది..ఎందుకంటే అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఆహారాలు, వ్యాయామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మానవ శరీరం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటుంది.
తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆహారాల్లో తప్పకుండా పోషకాలు అధికంగా ఉండే గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బార్లీతో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ప్రతి రోజు బార్లీతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల మరెన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బార్లీ వాటర్‌ను తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది:
బార్లీ నీటీని ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. బార్లీతో తయారు చేసిన నీటిని ప్రతి రోజు తాగితే ప్రేగు కదలిక ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది. దీంతో పాటు మలబద్ధకం సమస్య నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
గుండె ఆరోగ్యం కోసం:
బార్లీ నీటిలో పోషకాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగితే గుండె కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
అధిక బీపీ సమస్యలతో బాధపడుతున్నారా?:
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బార్లీ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు బీపీ లెవెల్స్ కూడా నార్మల్ అవుతాయి.
బరువు తగ్గడానికి..
బార్లీ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నాకు. ప్రతి రోజు బార్లీ గింజలను గంజిలా తయారు చేసుకుని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి.
రోగనిరోధక వ్యవస్థ:
బార్లీ నీటిలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం