Radhe Krishna: ఫస్ట్ టైమ్ తెలుగు, బంజారా భాషల్లో రానున్న ‘1980's లో రాధే కృష్ణ’ మూవీని విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమానికి ఛీఫ్ గెస్ట్ గా నిర్మాత బెక్కం వేణుగోపాల్, నిర్మాత రామ్ తాల్లూరి, హీరో సోహెల్ మరియు ఆటో రాంప్రసాద్ విచ్చేశారు.ఎం ఎల్ రాజా సంగీతం అందించారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాల్లూరి గారు మాట్లాడుతూ :
ఇది మా జిల్లాలో తీసిన సినిమా. సినిమా టీజర్ బాగుందన్నారు. పాటలు చాలా బాగా వచ్చాయి. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా నిర్మాతకి డబ్బులు యాక్ట్రెస్ కు మంచి పేరు తీసుకురావాలన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ :
చిన్న చిత్రాలకు నేను ఎపుడు అండగా ఉంటాను. ఈ సినిమా నేను చూసినప్పుడు క్లైమాక్స్‌లో ఇలా కాకుండా వేరేలా చేసి ఉంటే బాగుండేది అని చెప్పాను. చెప్పిన వెంటనే రైటర్స్ మరియు టీమ్ అంతా వచ్చి నా సలహా తీసుకొని మళ్లీ మూడు రోజులు షూట్ చేసి ఎడిట్ చేసి సినిమా తీసుకొచ్చారు. దానివల్ల అర్థమవుతుంది తెలుగు సినిమా అంటే ఎంత పిచ్చి అని. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా తీశారని మెచ్చుకున్నారు.
హీరో సోహెల్ మాట్లాడుతూ ..
ఈ సినిమా టీం నాకు కుటుంబం లాంటిది. మా సైదుల్ని నిర్మాతని టీం ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు కానీ మీకు రంగులు చూపిస్తూ మేము బ్లాక్ అండ్ వైట్ లో ఉండిపోతాము. ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు. జనాలకి ఏ సినిమా నచ్చుతుందో ఏ మూవీ నచ్చదో తెలియదు. కానీ మాకు తెలిసింది హిట్ అయిన ఫ్లాప్ అయిన సినిమా చేయడం ఒకటే ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా టీం కూడా అదే పట్టుదలతో మంచి సినిమా చేశారు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది మంచి సక్సెస్ అవుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ..
నిజానికి ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ గోపిగారు ఫోన్ చేసి ఈవెంట్ కి నన్ను ఆహ్వానించారు. టీజర్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
కథా రచయిత రాజేష్ మాచర్ల మాట్లాడుతూ :
ఈ ఈవెంట్ కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ కి, హీరో సోహెల్ కి, రామ్ తాల్లూరికి, ఆటో రాంప్రసాద్ కి అందరికీ కృతజ్ఞతలు. చిన్న సినిమా అయిన ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే ఆశా భావం వ్యక్తం చేశారు.
నిర్మాత ఊడుగు సుధాకర్ గారు మాట్లాడుతూ :
ఎంతో బిజీగా ఉండి కూడా సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.మా మూవీ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన తనికెళ్ల భరణి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో ఎస్ ఎస్ సైదులు మాట్లాడుతూ..
ఈ సినిమా కోసం కష్టపడిన మా టీమ్ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. చిన్న సినిమా అయినా సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
హీరోయిన్ భ్రమరాంబికా మాట్లాడుతూ..
చిన్న సినిమా అయినా సపోర్ట్ చేయడానికి వచ్చిన మా అతిధులకి కృతజ్ఞతలు. 1980లో రాధే కృష్ణ అప్పటి సిచువేషన్స్ కి తగినట్టు ఈ సినిమాని తీశారు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు.ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చితీరుతుంది.
దర్శకుడు ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ..
సినిమా పూర్తయింది టీజర్ ఎవరితో చేయించాలి అనుకున్నప్పుడు తనికెళ్ల భరణి వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆయన్ని అప్రోచ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన మహేంద్ర సింగ్ మాస్టర్ కి కృతజ్ఞతలు. ఆయన వాయిస్ తో టీజర్ కి ఒక కొత్త ఫీల్ వచ్చింది. రేపు థియేటర్స్ లో చూసే ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు. నటీనటులు : ఎస్ ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి తదితరులు. యాక్ట్ చేశారు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter