Pot Water Good For Health In Summer: వేసవిలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ క్రమంలో ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండానికి తప్పకుండా వేసవిలో మట్టి కుండలో నీటిని మాత్రమే తాగాల్సి ఉంటుంది. వీటిలో నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మట్టి కుండల్లో నీటిని తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1. నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది:
మట్టి కుండలో నీటిని పోయడం వల్ల నీటి నాణ్యత చాలా మంచిది. కుండ పోరస్ స్వభావం నీటి నుంచి మలినాలను ఫిల్టర్ చేస్తుంది. అంతేకాకుండా కుండలో నీటిని శుభ్రంగా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీర్యను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వేసవిలో తప్పకుండా కుండలో నీటిని తాగాల్సి ఉంటుంది.
2. నీటి PH స్థాయిలను బ్యాలెన్స్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది:
కుండలో ఉంచిన నీటి PH స్థాయి బ్యాలెన్స్ స్థిరంగా ఉంటాయి. అంతేకాకుండా మట్టిలో ఉండే స్వభావాలు నీటి ఆమ్లతను తటస్థీకరిస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
3. సహజమైన చల్లదనం:
మట్టితో చేసిన కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల నీరు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర వేసవిలో కూడా నీరు చల్లగా ఉంటాయి. మట్టి కుండలో నీరు నోటికి రుచిని కూడా అందిస్తాయి. కాబట్టి మీరు కూడా వేసవి కాలంలో మట్టి కుండలో నీటిని తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Investment Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి
Also Read: Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి