Barley Water Benefits 2024 In Telugu: వేసవిలో అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం ఎందుకంటే వాతావరణంలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి దీని కారణంగా చాలామందిలో డీహైడ్రేషన్‌తో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది ఈ సమయంలో హీట్ స్ట్రోక్ కి కూడా గురవుతారు. కాబట్టి ఎండాకాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మరింత కేర్ఫుల్‌గా ఉండడం ఎంతో మంచిది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారిలో షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం వంటి మార్పులు వస్తూ ఉంటాయి. దీంతోపాటు మరికొంతమందిలోనైతే అధిక రక్తపోటు సమస్య కూడా పెరుగుతుంది. అయితే వేసవిలో ఈ అన్ని సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఒక అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన బార్లీ డ్రింక్ ని ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
బార్లీలో శరీరానికి కావాల్సిన బీటా-గ్లూకాన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఎండాకాలంలో దీనిని తీసుకోవడం వల్ల పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు విసర్జన క్రియను మెరుగుపరిచేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. ముఖ్యంగా మలబద్ధకం పొట్ట ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ బార్లీ డ్రింక్ గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఎండాకాలంలో కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా ఈ డ్రింక్ ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేదని నిపుణులు చెబుతున్నారు.
ఈ బార్లీ నీటిలో ఉండే అద్భుతమైన ఔషధ మూలకాలు శరీరంలోని అన్ని నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా మధుమేహం వంటి సమస్యతో బాధపడే వారికి ఔషధాల కంటే ఎక్కువగా పని చేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ బార్లీ నీటిని తాగడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలను వేగంగా నియంత్రించుకోవచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు రాళ్ల సమస్యలతో బాధపడే వారికి ఈ నీరు ఎంతగానో పనిచేస్తుంది. అంతేకాకుండా రాళ్ళ నొప్పులను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం ఈ బార్లీ నీటిని తాగడం వల్ల సులభంగా వెయిట్ లాస్ అవుతారు. దీంతోపాటు ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు గర్భిణీ స్త్రీలకు కూడా ఎంతగానో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి