తమిళనాడులో సంచలనం సృష్టించిన గుట్కా కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు తాజాగా ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన ఈ శివకుమార్ అనే అధికారిని అరెస్ట్ చేశారు. తమిళనాడు మాజీ ఆరోగ్య శాఖ మంత్రితోపాటు గతంలో, ప్రస్తుతం కేబినెట్ లో మంత్రులుగా ఉన్న కొంతమంది నేతలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.