Trending Video: పాపం.. ఒక చిన్న అక్షరం తప్పు.. దుత్త కాస్త కుత్తా.. అంటే కుక్కలా మారిపోయాడు!

Bengal Ration Card Viral Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో ఓ వ్యక్తి కుక్కలా మొరుగుతూ కనిపించాడు. ఎందుకు అతను అలా చేశాడు.. ఎందుకు ఈ వీడియో అంత ట్రెండ్ అవుతోంది..?

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 12:02 PM IST
Trending Video: పాపం.. ఒక చిన్న అక్షరం తప్పు.. దుత్త కాస్త కుత్తా.. అంటే కుక్కలా మారిపోయాడు!

Bengal Ration Card Viral Video: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు తదితర వాటిలో కొన్నిసార్లు పేర్లు తప్పులు రావడం.. అడ్రస్‌లు మారిపోవడం.. పుట్టిన తేదీ సరిగా ఉండక పోవడం చూస్తునే ఉంటాం. మళ్లీ వాటిని ఛేంజ్ చేసుకునేందుకు ఆఫీసుల చుట్టూ తిరగడం కూడా కమాన్. అయితే ఒక్కొసారి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్‌తో మొత్తం అర్థాలే మారిపోతాయి. ఓ వ్యక్తి తన పేరు రేషన్ కార్డులో తప్పుగా వచ్చిందని వినూత్నంగా నిరసన తెలిపాడు. పేరు మార్పు కోసం కుక్కలా అరిచి.. తన ఆవేదన బయటపెట్టాడు. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 

పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన వ్యక్తి పేరు శ్రీకాంత్ దత్తా (Srikanth Dutta). అయితే రేషన్ కార్డులో పొరపాటున అతని ఇంటి పేరును కుక్క అని రాశారు. 'డి' అనే పదం స్థానంలో 'కె' (Kutta) రావడంతో అర్థమే మారిపోయింది. తన ఇంటిపేరు సరిదిద్దుకోవాలని చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురై అధికారుల ముందు కుక్కల్లా మొరిగాడు. ఇలా వినూత్నంగా నిరసన చేపట్టిన తీరును కొందరు వీడియో తీశారు . కారులో వెళ్తున్న ఓ అధికారిని వెంబడిస్తూ కుక్కలా అరిచాడు. 

 

కేవలం 46 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొంతమంది ఈ వ్యక్తి పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నారు. మరికొందరు చేసిన తప్పుకు సంబంధిత అధికారులు అతనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   

శ్రీకాంత్ మాట్లాడుతూ.. రేషన్‌కార్డులో ఇంటిపేరు మార్చాలని అధికారులకు మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తన పేరు శ్రీకంటి దత్తా అని కాకుండా శ్రీకంత్ కుక్క అని రాశారని చెప్పారు. దీని వల్ల మానసికంగా కూడా ఇబ్బంది పడినట్లు వాపోయారు. తప్పుగా ముద్రించారని.. సరిచేస్తామని అధికారులు చెప్పి.. ఇంతవరకు చేయలేదన్నారు. తన పనులు మానుకుని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. అందుకే ఆ అధికారిని చూసి తాను కుక్కలా అరుస్తూ ప్రశ్నించానని అన్నారు. అయితే తన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అధికారి పారిపోయారని చెప్పారు. శ్రీకాంత్ నుంచి దరఖాస్తు తీసుకున్న అధికారి.. రేషన్ కార్డులో కుక్క అనే పదాన్ని తొలగించాలని ఉద్యోగులను ఆదేశించి.. ఇంటి పేరు సరిచేయాలని సూచించారు.

Also Read: Ram Gopal Varma: డేంజరస్ మూవీతో వస్తున్న ఆర్జీవీ.. ట్రైలర్ రిలీజ్  

Also Read: Ind Vs Nz T20: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 కూడా రద్దు..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News