Anand Mahindra: ఆ జ్యోతిష్యుని పేరు ఎందుకు బయటపెట్టలేదతను?

డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడవుతాడని ఆనంద్ మహీంద్రకు చెప్పిన జ్యోతిష్యం తప్పింది. ఆ జ్యోతిష్యుని పేరు బయటపెట్టనందుకు సంతోషంగా ఉందంటూ మరోసారి ఫన్నీ వాఖ్యలతో చర్చనీయాంశమవుతున్నారు ఆనంద్ మహీంద్ర.

Last Updated : Nov 8, 2020, 08:44 PM IST
Anand Mahindra: ఆ జ్యోతిష్యుని పేరు ఎందుకు బయటపెట్టలేదతను?

డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) మరోసారి అధ్యక్షుడవుతాడని ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra )కు చెప్పిన జ్యోతిష్యం తప్పింది. ఆ జ్యోతిష్యుని పేరు బయటపెట్టనందుకు సంతోషంగా ఉందంటూ మరోసారి ఫన్నీ వాఖ్యలతో చర్చనీయాంశమవుతున్నారు ఆనంద్ మహీంద్ర.

అమెరికా అధ్యక్షఎన్నికల ( America President Elections ) సందర్భంగా ప్రపంచమంతా ఎనలేని ఆసక్తి, ఉత్కంఠత నెలకొంది. డోనాల్ట్ ట్రంప్ ( Donald trump ) విజయం సాధిస్తారని కొందరు, జో బిడెన్ ( Joe Biden ) గెలుస్తారని మరి కొందరు వాదిస్తూ వచ్చారు. ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లతో వార్తల్లో ఉండే ఆనంద్ మహీంద్ర కూడా అమెరికా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై స్పందించారు.డోనాల్డ్ ట్రంప్ మరోసారి గెలుస్తారంటూ ఓ జ్యోతిష్యుడి జాతకాన్ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అప్పట్లో సంచలనమైంది.

కానీ ఫలితాల్లో.. 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించి అమెరికా 46 వ అధ్యక్షుడి ( America 46th president ) గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో  ఆనంద్ మహీంద్రకు ఆ జ్యోతిష్యుడి చెప్పిన జాతకం తప్పింది. అందుకే ఇప్పుడు మరోసారి ఫన్నీగా వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన ట్వీట్ ను కవర్ చేసుకునే ప్రయత్నమే గానీ...చెప్పిన దాంట్లో లాజిక్ కన్పించింది. ఎంతకైనా ప్రముఖ వ్యాపారవేత్త కదా..ఆ మాత్రం చాతుర్యం ఉంటుంది. 

తాను కోట్ చేసిన జాతకంలో జ్యోతిష్యుని పేరు బయటపెట్టనందుకు సంతోషంగా ఉందని..కానీ అతని ఉద్యోగానికి ప్రమాదముండే అవకాశముందని మరోసారి ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ మరోసారి వైరల్ అయింది.

ఫలితాలు రాకముందు ఓ జ్యోతిష్యుడు డోనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమంటూ..లెక్కలు వేసి..జాతక చక్రం రాసి..ఆ ఛార్ట్ పై ట్రంప్ పేరు రాసి..అతని పుట్టిన తేదీ వివరాల్ని కూడా పొందుపర్చాడు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాసరే..ట్రంప్ గెలుపు ఖాయమన్నాడు. ఈ ఛార్ట్ నే ఆనంద్ మహీంద్ర అప్పట్లో ట్వీట్ చేశారు. ఇప్పుడా జ్యోతిష్యుని పరిస్థితి ఏంటో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్న నేపధ్యంలో ఆనంద్ మహీంద్ర  మరోసారి ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. Also read: Mumbai To Hyderabad: 3.5 గంటల్లోనే ముంబై-పుణె-హైదరాబాద్ జర్నీ ? ఎలాగో తెలుసా ?

Trending News