Loksabha Speaker Election: స్పీకర్‌గా ఓం బిర్లా, విపక్షాలకు డిప్యూటీ, అంతా ఏకగ్రీవమే

Loksabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై సందిగ్దత వీడింది. మరోసారి ఓం బిర్లా ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిపక్షాలు అంగీకరించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఈసారి విపక్షానికి దక్కనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 25, 2024, 12:36 PM IST
Loksabha Speaker Election: స్పీకర్‌గా ఓం బిర్లా,  విపక్షాలకు డిప్యూటీ, అంతా ఏకగ్రీవమే

Loksabha Speaker Election: లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపికపై సందిగ్దత తొలగింది. తొలిసారి అధికార, ప్రతిప్రక్షాల మధ్య సయోధ్య కుదిరింది. డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయింపు షరతుపై ప్రతిపక్షాలు స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లాను అంగీకరించాయి. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక వ్యవహారం ఏకగ్రీవం చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. డిప్యూటీ పదవి కేటాయించే షరతుపై ప్రతిపక్షాలు ఏకగ్రీవానికి ఒప్పుకున్నాయి. దాంతో ఓం బిర్లా మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు జూన్ 26 ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ లాంఛనం కానుంది. నామినేషన్ దాఖలు కాగానే ఎన్నిక పూర్తయినట్టు ప్రకటిస్తారు. ఓం బిర్లాను స్పీకర్‌గా కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, టీఎంసీ, డీఎంకే సహా ప్రతిపక్షాలు అన్నీ అంగీకరించాయి. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు కేటాయించనున్నారు. 

విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే స్పీకర్ ఎంపిక ఏకగ్రీవానికి సహకరిస్తామని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. అటు అఖిలేష్ యాదవ్ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. ప్రతిపక్షాల నుంచి డిప్యూటీ స్పీకర్ ఎవరుంటారనేది ఇంకా ఖరారు కాలేదు. 

వరుసగా రెండోసారి స్పీకర్ అయిన వ్యక్తుల్లో ఓం బిర్లా మూడో వ్యక్తి కానున్నారు. గతంలో బలరాం జాఖర్ 9 ఏళ్లు స్పీకర్‌గా ఉన్నారు. అంతకుముందు గుర్దియల్ సింగ్ థిల్లాన్ రెండు సార్లు ఆరేళ్లపాటు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు కేటాయించడం ఆనవాయితీ. కానీ 2014లో బీజేపీ తన మిత్రపక్షం అన్నాడీఎంకేకు చెందిన తంబిదురైని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంది. 2019 నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. 

Also read: NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News