మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటన, డైరెక్షన్ ఈ రెండే వేర్వేరు బాధ్యతలని.. ఒకేసారి ఈ రెండు చేయడం తనవల్ల కాదని చమత్కరించారు. . అసలు ఈ ప్రస్తవన ఎందుకు వచ్చిందనేది తెలుసుకోవాలనుకుంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
'సైరా నరసింహ రెడ్డి ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రగంగిస్తూ తనతో జరిగిన పరుచూరి బ్రదర్స్ సంభాషణను గుర్తు చేసుకు్నారు. సైరా కథ సిద్దమయ్యాక పరుచూరి బ్రదర్స్ నటనతో పాటు దర్శకత్వం కూడా చేయాలని మెగా స్టార్ ని అడిగారట. దానికి చిరు బదులిస్తూ ఒకేసారి ఈ రెండు భాద్యతలు నిర్వర్తించడం తన వల్ల కాదు.. రెండిటిలో ఏది చేయమంటారని అడిగాడట. దానికి వెంటనే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి గా మిమ్మల్నే ఊహించుకున్నామని ... ఈ పాత్రను మీరే చేయాలని చెప్పిన పరుచూరి బ్రదర్స్... సినిమాకు మరో దర్శకుడిని చూద్దాం అన్నారట. ఈ విషయాన్ని వేదికపై చిరు స్వయంగా చెప్పుకున్నారు.
మెగా స్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ 'సైరా నరసింహ రెడ్డి' అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు. అయితే ఈవెంట్ లో సినిమా సెట్స్ పైకి రాకముందు జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ విషయం చిరు నోటీ నుంచి ఇలా బయటికొచ్చింది.