Vijay Varisu : వంశీ పైడిపల్లి దెబ్బ.. దిల్ రాజుకు తడిసి మోపడైనట్టుందిగా

Dil Raju Varisu Budget దిల్ రాజు తాజాగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. దిల్ రాజు నిర్మించిన వారిసు సినిమాను సంక్రాంతి బరిలోకి తీసుకొస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ గురించి టాపిక్ నడుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 04:39 PM IST
  • సంక్రాంతి బరిలో విజయ్ వారసుడు
  • ఆలస్యం చేసిన వంశీ పైడిపల్లి
  • దిల్ రాజు లెక్కలు తప్పాయా?
Vijay Varisu : వంశీ పైడిపల్లి దెబ్బ.. దిల్ రాజుకు తడిసి మోపడైనట్టుందిగా

Vijay Varisu Budget విజయ్ వారసుడు సినిమా పక్కా తమిళ్ సినిమా అని దిల్ రాజు, వంశీ పైడిపల్లి అంటారు. వారిసు సినిమా పక్కా తెలుగు సినిమాలా ఉంటుందని హీరో శ్రీకాంత్ అంటాడు. అది తెలుగు సినిమానా? తమిళ సినిమానా? అని పక్కన పెట్టేస్తే.. ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ విషయం చర్చల్లోకి వచ్చేసింది. అసలే వంశీ పైడిపల్లి సినిమాలన్నీ ఎలా లేట్ అవుతాయో అందరికీ తెలిసిందే. వంశీ పైడిపల్లి సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌లతో తెరకెక్కుతాయి. ఎంతో గ్రాండ్‌గా లావిష్‌గా తీస్తుంటాడు. 

పైగా వంశీ పైడిపల్లి చాలా స్లోగా సినిమాను డైరెక్ట్ చేస్తుంటాడు. అనుకున్న డేట్స్ కంటే ఎక్కువే అవుతాయి. బడ్జెట్‌లు కూడా అందుకే పెరుగుతుంటాయి. అయితే ప్రతీ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్‌గానే నిలుస్తుంటుంది. మహర్షి సినిమాకు కూడా నష్టాలే వచ్చాయని చెబుతుంటారు. అయితే ఇప్పుడు విజయ్ వారిసు సినిమా విషయంలోనూ అదే జరిగిందని టాక్.

ముందు అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అయిందని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో ఓ అడ్డూఅదుపు లేకుండా పోయిందని సమాచారం. దాదాపు నలభై, యాభై రోజులు ఎక్కువ షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో నలభై కోట్ల వరకు బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చినట్టు టాక్.

ఈ మొత్తాన్ని దిల్ రాజు రికవరీ చేసేందుకు బాగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నాడట. తమిళంలో గనుక కాస్త క్లిక్ అయితే కోట్లకు కోట్లు వస్తాయి. ఇక తెలుగులో ఈ సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఇక్కడా క్లిక్ అయితే మాత్రం సినిమాకు, దిల్ రాజుకు ఎలాంటి ఢోకా ఉండదని చెప్పొచ్చు.

Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News