Pushpa Song Steps: శ్రీవల్లి పాటకు ఫ్లైట్‌లో ఎయిర్ హోస్టెస్ స్టెప్పులు, వీడియో వైరల్

Pushpa Song Steps: పుష్ప సినిమా మేనియా అందరిపై పడుతోంది. సామూన్యుల నుంచి మొదలుకుని..ప్రత్యేక వ్యక్తులపై కూడా పుష్ప ఎఫెక్ట్ కన్పిస్తోంది. అందుకే పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఒక ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్‌లో వేసిన ఆ స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2022, 09:40 AM IST
Pushpa Song Steps: శ్రీవల్లి పాటకు ఫ్లైట్‌లో ఎయిర్ హోస్టెస్ స్టెప్పులు, వీడియో వైరల్

Pushpa Song Steps: పుష్ప సినిమా మేనియా అందరిపై పడుతోంది. సామూన్యుల నుంచి మొదలుకుని..ప్రత్యేక వ్యక్తులపై కూడా పుష్ప ఎఫెక్ట్ కన్పిస్తోంది. అందుకే పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఒక ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్‌లో వేసిన ఆ స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ పాన్ ఇండియా (Pan India Movie)మూవీ, అల్లు అర్జున్ నటించిన పుష్ప ప్రపంచమంతా సందడి చేస్తోంది. ఉత్తరాదిన అయితే మెగా హిట్ దిశగా దూసుకుపోతోంది. భారీగా కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటన అందర్నీ ఆకట్టుకుంటోంది. ఫలితంగా అందరికీ పుష్ప మేనియా పట్టుకుంది. ప్రతి ఒక్కరూ పుష్ప (Pushpa Movie) పాటలకు స్టెప్పులేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎయిర్ హోస్టెస్ ఏకంగా ఫ్లైట్‌లో పుష్ప సినిమాకు వేసిన స్టెప్పుల వీడియో వైరల్ అవుతోంది. శ్రీవల్లి పాటకు హుక్ స్టెప్ వేయడానికి ఒక ఎయిర్ హోస్టెస్ తీవ్రంగా ప్రయత్నించింది. ఖాళీ ఫ్లైట్‌లో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసేందుకు ప్రయత్నించింది. చెప్పులకు బదులు తాను వేసుకున్న హాఫ్ షూస్‌తో హుక్ స్టెప్పుకు ప్రయత్నించి విఫలమైంది. దాంతో సిగ్గుతో నవ్వుకుంటూ..తల దాచుకుంది.

వాస్తవానికి ఆ స్టెప్పు ఎలా వేయాలో తనకి అర్ధం కాలేదు. అయినా తన ప్రయత్నం తాను చేసినట్టుంది. తానేసిన స్టెప్పులు సరిగ్గా లేవని ఆ ఎయిర్ హోస్టెస్‌కు అర్ధమైంది కూడా. అందుకే నవ్వుకుంటూ పక్కకు వెళ్లిపోయింది. శ్రీవల్లి పాటకు అల్లు అర్దున్ వేసిన హుక్ స్టెప్ (Srivalli Song Dance).. వేసేందుకు ఎయిర్ హోస్టెస్ చేసిన ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోక తప్పదేమో. ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌పై ఈ వీడియో షేర్ అయింది. ఈ ఎయిర్ హోస్టెస్ పేరు మీనాక్షి. స్పైస్‌జెట్ ఫ్లైటా్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. ఇంతకుముందు ఫ్లైట్‌లో సామీ పాటకు కూడా స్టెప్పులేసింది. ఆ వీడియో కూడా పెద్దగా వైరల్ అయింది. వేలాది మంది వీక్షించడమే కాకుండా లైక్స్ కొట్టారు. ఇప్పుడీ వీడియో కూడా హల్‌చల్ చేస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uma meenakshi (@yamtha.uma)

 

గతంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, సురేష్ రైనా తదితరులు చాలా మంది పుష్ప సినిమాలోని వివిధ పాటలకు డ్యాన్స్ వేసి హల్ చల్ సృష్టించారు. అటు బంగ్లాదేశ్ క్రికెటర్ వికెట్ తీసిన ఆనందంతో పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదే లే మేనియా అందరి ముందు చూపించాడు.

Also read: Shyam Singha Roy: రోజీ సింగరాయ్ కోసం.. ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌! షాక్‌లో హీరో నాని!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News