Sirivennela Birth Anniversary: తెలుగు సినీ దిగ్గజ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి జయంతి రేపు. ఈ సందర్భంగా
శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో 'నా ఉచ్ఛ్వాసం కవనం' ప్రోగ్రాం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి హాజరై టీజర్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ రామ్ చెరువు మాట్లాడుతూ -
కళా తపస్వీ విశ్వనాథ్‌తో విశ్వనాథామృతం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు 2011లో సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలిశాము. ఆయన దగ్గరకు ఎవరు వెళ్లినా ముందు తన పాట ఒకటి పాడి వినిపిస్తుండేవారు. అలా మాకు కొన్ని పాటలు వినిపించారు. అవి సూపర్ హిట్ సాంగ్స్ కాదు కానీ సాహిత్యపరంగా ఎంతో అమూల్యమైన పాటలు. ఆ సాంగ్స్.. ఆ పాటల వెనక సీతారామశాస్త్రి చేసిన కృషి గురించి తెలుసుకున్న తర్వాత ఈ మాటలు మాకే కాదు అందరికీ తెలియాలనే ఆలోచన కలిగింది. సిరివెన్నెల అంతరంగం పేరుతో నాలుగు ఎపిసోడ్స్ చేశామన్నారు. సీతారామశాస్త్రి గారు తన పాట గురించి వివరించిన తర్వాత ఆ పాటను సింగర్స్ పాడేవారు. కొన్ని రోజుల తర్వాత మ్యూజిక్ లేకుండా సింగర్స్ తో కేవలం లిరిక్స్ పాడించాం. మూడు ఎపిసోడ్స్ అనుకున్నది 13 ఎపిసోడ్స్ చేశాము.ఆ తర్వాత ఈ ప్రోగ్రాంను ఆడియన్స్‌ను చేర్చాలి అనుకుంటున్నప్పుడు త్రివిక్రమ్ మాకు సపోర్ట్ చేశారు. సీతారామశాస్త్రి మాట అందరికీ చేరాలని ఉద్దేశ్యంతో చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ్ శాస్త్రి మాట్లాడుతూ -
మనమంతా ఒక కారణంతో ఈ భూమ్మీదకు వస్తాము. అలా ఒక బృహత్తరమైన బాధ్యతతో పుట్టారు అన్నయ్య సీతారామశాస్త్రి. తన కర్తవ్యాన్ని ముగించి వెళ్లిపోయారు. ఉన్నంతకాలం శ్రమ చేస్తూనే ఉన్నారు. ఎన్నో విలువైన పాటలను మనకు అందించారు. తన సాంగ్స్‌తో సమాజాన్ని మేల్కొలిపారు.
సింగర్ పార్థసారధి మాట్లాడుతూ..
సీతారామశాస్త్రి లాంటి గొప్ప గేయ రచయిత ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. ఆయన పాటలు పాడే గొప్ప అవకాశం నాకు రావడం గర్వంగా భావిస్తున్నాను. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇది పూర్తి చేయగలమా అనే భయం ఉండేది. నేను చేయగలనా అనే సందేహం కలిగినప్పుడు శ్రీరామ్ ధైర్యం చెప్పేవారు. ఇవాళ ఎంతోమంది శాస్త్రి గారి అభిమానులు, గొప్ప స్థాయిలో ఉన్నవాళ్లు మాకు సపోర్ట్ చేశారు. సిరి డెవలపర్స్ మూర్తి, సిలికానాంధ్ర, డాక్టర్ గురువారెడ్డి వీళ్లందరి సహకారంతో ముందుకెళ్లాము. శాస్త్రి గారి పాటలను, మాటలను చిరకాలం నిక్షిప్తం చేయాలనేది మా ప్రయత్నమన్నారు.
దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ..
నాకు సీతారామశాస్త్రితో కృష్ణవంశీ తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పాటలు లేకుండా తన సినిమాలేవున్నారు. నేను ఏ సినిమా మొదలుపెట్టినా ముందు సీతారామశాస్త్రి గారి దగ్గరకు వెళ్లి పాటల గురించి మాట్లాడేవాణ్ణి. నా కొత్త సినిమా మొదలుపెట్టాలని ఆరేడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నాను. శాస్త్రి గారు లేకపోవడం వల్ల అనాథగా మారిన భావన కలుగుతోందన్నారు కృష్ణవంశీ.
Also read: Kalyana Lakshmi: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తులం బంగారం పంపిణీ ఆరోజు నుంచే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook