Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!

 Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరోగా కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి సుధాకర్ ఉన్నారని, ఆయన అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నారని అంటున్నారు. ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు నందమూరి అభిమానులు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 30, 2023, 11:42 AM IST
Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!

Real Hero in Taraka Ratna Health Issue: ఒకప్పుడు ఒకే రోజు 9 సినిమాల ఓపెనింగ్ తో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఎవరికి సాధ్యం కాని రికార్డును తన పేరు మీద లిఖించుకున్న తారకరత్న ఈ మధ్యకాలంలో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన బావ నారా లోకేష్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రలో కూడా నందమూరి తారకరత్న పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో ఆయనకు ఒక కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలడంతో ముందుగా ఆయనని కుప్పం హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.

అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి బెంగళూరు కూడా తరలించారు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ అనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తారకరత్న ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని ముందు ప్రచారం జరిగినా నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి సేఫ్గానే ఉందని మరో 10 వారాలు పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం మీద అధికారికంగా ప్రకటన లేదు కానీ నందమూరి అభిమానులు షేర్ చేస్తున్న ఒక వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేమిటంటే తారకరత్న ప్రాణాలు కాపాడడానికి బాలకృష్ణ,  చంద్రబాబు చేస్తున్న కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ చాలా మందికి తెలియని వ్యక్తి తెరవెనుక హీరో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ అని వారంతా అంటున్నారు. చంద్రబాబు నాయుడు కర్ణాటక సీఎం బసవరాజుతో మాట్లాడి బెంగళూరు వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరినప్పటి నుంచి మొదలు తారకరత్నను బెంగళూరు తీసుకువెళ్లిన క్షణం నుంచి ప్రతి ఒక్కటి సుధాకర్ దగ్గర ఉండి సిద్ధం చేశారని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్,  రాజ్కుమార్ ఫ్యామిలీలను రిసీవ్ చేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లారని వైద్యులతో మాట్లాడుతూ ఏది కావాలంటే అది పర్సనల్గా తీసుకొని ఎప్పటికప్పుడు క్షణాల వ్యవధిలో సెట్ చేయడం సహ అన్ని విషయాలు వారే దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆయనే తెరవెనుక హీరో అని అధికారిక కార్యక్రమాలు సైతం ఆయన రద్దు చేసుకున్నారని నందమూరి అభిమానులు చెబుతున్నారు. అందుకే జీవితాంతం మీకు రుణపడి ఉంటాం మంత్రిగారు అంటూ ఆయన ఫోటోతో కూడిన పోస్టులను నందమూరి అభిమానులు షేర్ చేస్తున్నారు.

Also Read: Rajinikanth Called : వీర సింహారెడ్డి డైరెక్టర్ కు రజనీకాంత్ ఫోన్.. గాల్లో తేలిపోతున్నాడుగా!

Also Read: Taraka Ratna Latest Health Update: కాసేపట్లో తారకరత్నకు కీలక వైద్యపరీక్షలు.. ఆ తరువాత హెల్త్ బులెటిన్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News