Nivetha Pethuraj about love failure:
నివేదా పేతురాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో.. సినిమాతో మన అందరికీ చేరువైంది ఈ హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్..అలవైకుంఠపురం సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించింది. రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో.. వచ్చిన రెడ్.. సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిసింది ఈ భామ. తెలుగులో ఈ హీరోయిన్ కి వచ్చిన అవకాశాలు కొన్ని అయినప్పటికీ.. ఇతర భాషల్లో మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ.. మంచి రివ్యూ తెచ్చుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో తెగ ఆక్టివ్ గా పాల్గొంటుంది నివేదా. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీ గతం మీరు చూసుకుంటే.. మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు అని ఇంటర్వ్యూలో.. నివేతాని అడగగా దానికి ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది ఈ హీరోయిన్. ‘డేటింగ్ చేసే ముందు.. అసలు ఆ అబ్బాయి ఎలాంటి వారు.. అనేదాన్ని గురించి బాగా తెలుసుకోవాలి. ముందు ఫ్రెండ్షిప్ చేసి.. ఆ తర్వాత మాత్రమే డేటింగ్ చేయాలి’ అని తెలిపింది.
ఈ జవాబు వినగానే అక్కడ ఉన్న యాంకర్.. మీకు గతంలో చేదు అనుభవం ఉన్నట్టు ఉంది..అని అడగగా నివేతా.. ‘ఇప్పట్లో అందరూ లవ్, డేటింగ్ చేస్తున్నారు. సింగిల్ గా ఉండటానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు’ అని తెలిపింది. దీంతో గతంలో నివేతా లవ్ ఫెయిల్యూర్ అని, అసలు ఎవరో ఆ అబ్బాయి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం
Also Read: C Naga Rani IAS: వెస్ట్ గోదావరికి పవర్ ఫుల్ ఆఫీసర్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అందరికీ హడలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి