పవన్ కళ్యాణ్, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వచ్చేస్తోంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని త్వరలో నిర్మించదలిచామని ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. 

Last Updated : Feb 4, 2018, 04:25 PM IST
పవన్ కళ్యాణ్, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వచ్చేస్తోంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని త్వరలో నిర్మించదలిచామని ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయని.. ఒకసారి అవి జరిగాక షూటింగ్ ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. ఆదివారం వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి సందర్శనకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ముచ్చటించారు.

ఆ ముచ్చట్లలో భాగంగా ఆయన ఈ వార్తను తెలిపారు. టి.సుబ్బిరామిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు 2006లో కేంద్ర గనుల శాఖమంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ నాయకుడిగా ఆయన గతంలో విశాఖ నుండి లోక్‌సభకు పలుమార్లు ఎన్నికయ్యారు.  మెగస్టార్ చిరంజీవి నటించిన "స్టేట్ రౌడీ" చిత్రానికి సుబ్బిరామిరెడ్డి నిర్మాత కూడా. 

ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ఆ ప్రాజెక్టుపై అభిమానులకు ఉండే అంచనాలు ఏమిటో చెప్పుకోవాల్సిన పని లేదు. పైగా ఇద్దరూ రాజకీయాల్లో ఉండడం వల్ల ఎలాంటి కథను ఎంచుకుంటారన్న విషయం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే సుబ్బిరామిరెడ్డి కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతారా.. లేదా నిజంగానే ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించే సాహసం చేస్తారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.

గతంలో చిరంజీవి నటించిన 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రంలో పవన్ కళ్యాణ్ కొద్ది సేపు గెస్ట్ రోల్‌లో కనిపించి అందరినీ అలరించారు. అలాగే ఇటీవలి కాలంలోనే పవన్ తను పూర్తిగా పార్టీ పనుల్లోనే మునిగితేలుతానని చెప్పారు. ఈ క్రమంలో సుబ్బిరామిరెడ్డి చేస్తున్న మాటల వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Trending News